రోజూ 15 నిమిషాలు సైక్లింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

Updated on: May 11, 2025 | 9:16 AM

ప్రస్తుత కాలంలో చాలామంది ఫిట్‌నెస్ గురించి ఆలోచిస్తున్నారు. కానీ అందుకు సమయం కేటాయించలేకపోతున్నారు. అయితే రోజు కేవలం 15 నిమిషాలు కేటాయిస్తే చాలు. మంచి ఆరోగ్యం మీ సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజు ఒక పావుగంట సైక్లింగ్ చేసేందుకు సమయం కేటాయిస్తే శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందంటున్నారు.

నిపుణుల ప్రకారం సైక్లింగ్ చేయడం వల్ల కాళ్లు, పిక్కలు, తొడల భాగాలలోని కండరాలు బలంగా మారుతాయి. లోయర్ బాడీ మొత్తం స్ట్రాంగ్‌గా మారుతుంది. శక్తివంతమైన శరీరం మీ సొంతం అవుతుంది. ఎక్కువ సమయం కూర్చుని ఉద్యోగాలు చేసేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సైక్లింగ్ వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. రోజు 15 నిమిషాలు సైక్లింగ్ చేయడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం సమయంలో దీనిని అలవాటు చేసుకుంటే త్వరగా ఫలితాలు కనిపిస్తాయి. సైక్లింగ్ వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే సంతోషకరమైన హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి మంచి ఫీలింగ్‌ని కలిగిస్తుంది. మూకాలు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మంచి నిద్ర పడుతుంది. ఉదయం సైక్లింగ్ చేస్తే రోజంతా ఉల్లాసంగా ఉంటారు. హైబీపీ తగ్గుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది మితంగా తీసుకుంటే గుండెకు మేలు చేస్తుంది.. మోతాదు మించితే హానికరం

వాల్ నట్స్ వల్ల ఎన్ని ఉపయోగాలో మీకు తెలుసా ??