Crime: ఛాతిలో కత్తి.. అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాలుడు.. పోలీసులు షాక్!
ఢిల్లీలోని బహార్గంజ్ పోలీస్ స్టేషన్‌కు ఛాతిలో కత్తితో ఓ 15 ఏళ్ల బాలుడు వచ్చాడు. తన స్నేహితులు తనపై దాడి చేశారని పోలీసులకు తెలిపాడు. ఆసుపత్రిలో శస్త్రచికిత్స తర్వాత, ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడి ప్రతికారం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఢిల్లీలోని సెంట్రల్ ఢిల్లీలో గురువారం మధ్యాహ్నం ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల ఓ పాఠశాల విద్యార్థి తన ఛాతిలో కత్తితోనే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. బహార్గంజ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాలుడిని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. బాలుడు తన ఛాతిలో కత్తి దిగి ఉందని, తన స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు తనపై దాడి చేసి కత్తితో పొడిచారని వెల్లడించాడు. వెంటనే పోలీసులు అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రాం మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించి, అక్కడ శస్త్రచికిత్స ద్వారా కత్తిని సురక్షితంగా తొలగించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దాడి జరిగిన మరుసటి రోజు సాయంత్రం పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వయస్సు 15, 16 ఏళ్లుగా గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో ఈ దాడి ప్రతికార దాడిగా ఉండొచ్చని తేలింది.
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు ఎఫ్డీ చేస్తా... సర్పంచ్ అభ్యర్థి హామీ
ఏంది సామీ ఇదీ.. నువ్వు నేతవా.. మాంత్రికుడివా
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ఈ కోతులు సల్లగుండా సర్పంచ్ ఎన్నికలనే మార్చేశాయిగా
ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. చివరికి
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు

