ఆ రెండు దగ్గు సిరప్‌లు బ్యాన్‌రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దు

Updated on: Oct 11, 2025 | 3:07 PM

దగ్గు మందు 21 మంది పసిపిల్లల ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో చిన్నారులు అస్వస్థతకు లోనుకావటం దేశాన్ని షాక్‌కు గురిచేసింది. దగ్గుమందు అంటే.. ప్రాణాలు తీసే విషమనే స్థాయిలో భయాందోళనలు చిన్నారుల తల్లిదండ్రులను వణికించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మ‌రో కీల‌క నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో రెండు కాఫ్ సిరప్‌లపై నిషేధం విధించింది. బ్యాన్‌కు గురైన కాఫ్ సిరప్‌లలో రీలైఫ్, రెస్పిఫ్రెష్-టీఆర్‌ సిరప్‌లు ఉన్నాయి. అయితే, ఈ రెండు దగ్గు మందులను మెడికల్ స్టోర్‌లలో ఎవరూ విక్రయించొద్దంటూ స్టేట్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కిడ్నీ వైఫల్యానికి కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్ కు సంబంధించి.. SR-13 బ్యాచ్ సిరప్‌ను అసలే వాడొద్దని డ్రగ్ కంట్రోల్ అథారిటీ తాజాగా ఆదేశించింది. రాష్ట్రంలోని మెడికల్ స్టోర్‌లు, ఆసుపత్రులలో ఆ బ్యాచ్ సిరప్‌లు ఉంటే వెంటనే సీజ్ చేయాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పైన పేర్కొన్న ఆ రెండు రెండు సిర‌ప్‌ల‌ను విక్ర‌యించ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తమిళనాడులో కోల్డ్‌ రిఫ్‌ దగ్గు మందు తయారీ సంస్థ యజమాని అరెస్ట్‌ అయ్యారు. తమిళనాడు పోలీసులు, ఏడుగురు మధ్యప్రదేశ్ పోలీసుల బృందం కలిసి కోడంబాక్కంలోని అశోక్ నగర్ PS పరిధిలోని రంగనాథ్‌ని అయన ఇంట్లో అరెస్ట్ చేశారు. ఇక దగ్గు మందుతో మరణాల ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. చిన్నారులకు కాఫ్ సిరప్‌లు సూచించే విషయంలో అప్రమత్తత పాటించాలని ఆదేశించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rukmini Vasanth: కాంతార… కాంత రుక్మిణి చరిత్ర తెలుసా ??

శ్రీవారి క్యాలెండర్లు రెడీ.. ఈసారి ఆన్‌లైన్‌లోనూ డెలివరీ

లేటుగా వచ్చారా.. రంగు డబ్బా కొనుక్కురండి విద్యార్ధులకు ప్రిన్సిపాల్ వింత పనిష్మెంట్‌

ఫోన్‌పే కొత్త ఆవిష్కరణ ‘స్మార్ట్ పాడ్‌’తో చెల్లింపులు మరింత ఈజీ!

దారుణం.. బంగారం కోసం పుర్రెను ఎత్తుకెళ్లిన దొంగలు

Published on: Oct 11, 2025 03:06 PM