సరిపడా నీరు తాగితే బీపీ తగ్గుతుందా ??

Updated on: Oct 06, 2025 | 7:53 PM

మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. రోజుకి ఏడెనిమిది గ్లాసుల నీరు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. శరీరం హైడ్రేటడ్‌గా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతుంటారు. శరీరంలోని అన్ని భాగాలకు సరిపడా ఆక్సిజన్‌, రక్త సరఫరా సాగాలంటే నీటిని కచ్చితంగా సరిపడా తీసుకోవాలి.

శరీరంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణం.. సరిపడా నీటిని తీసుకోకపోవడమే అని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో మంచి నీరు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. రోజూ సరిపడా నీటిని తీసుకోవడం బీపీ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని చెబుతున్నారు. భవిష్యత్తులో రక్తపోటు బారినపడకుండా ఉండాలంటే శరీరానికి సరిపడా నీటిని అందించాలని చెబుతున్నారు. రక్తపోటు నియంత్రించడానికి నీరు బాగా ఉపయోగపడుతుంది. మంచి నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ బిపిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. నీటితో పాటు అప్పుడప్పుడు నిమ్మరసం, దోసకాయ, హెర్బల్‌టీ, తక్కువ ఉప్పుతో సూప్, పాలు, పెరుగు వంటివి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తపోటు సమస్య బారిన పడకుండా ఉంటారు. శరీరానికి నీరు అందిస్తే ఆ నీరు శరీరంలోని రక్త నాళాలను సడలిస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడతాయి. నీరు రక్తాన్ని పలుచన చేయడంలో ఉపయోగపడుతుంది. దీంతో రక్తపోటు సమస్య దూరమవుతుంది. నీరు శరీరంలోని విష పదార్థాలను తొలగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటు అదుపులో ఉండాలంటే నీరుతో పాటు తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు స్విమ్మింగ్, యోగా, మెడిటేషన్‌ అలవాటు చేసుకోవాలి. వీటన్నింటితోపాటు. ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేయాలి. యోగా, మెడిటేషన్‌ ద్వారా ప్రశాంతతను సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా మద్యం, స్మోకింగ్‌కు పూర్తి దూరంగా ఉండాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలున్న వారు వైద్యుల సూచనలు పాటించాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దూసుకొస్తున్న తోకచుక్క.. భూమికి ప్రమాదం తప్పదా

కోల్డ్‌ రిఫ్‌ను బ్యాన్‌ చేయడం హర్షణీయం

పరిమళించిన మానవత్వం.. వైరల్ అవుతోన్న వీడియో

యముడు లంచ్‌ బ్రేక్‌‌లో ఉన్నట్టున్నాడు.. అంత ప్రమాదంలో కూడా ప్రాణాలతో బయటపడ్డాడు

రూ. 5 వేలకు కోటిన్నర ప్రాపర్టీ మీ సొంతం