దూసుకొస్తున్న ‘మోంథా’ తుపాన్‌ అంతటా హై అలర్ట్‌ వీడియో

Updated on: Oct 26, 2025 | 3:55 PM

బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం మోంతా తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అధికారులు హై అలర్ట్‌ ప్రకటించి, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.

తెలుగు రాష్ట్రాలకు మోంతా తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం ఆదివారం తీవ్ర వాయుగుండంగా, సోమవారం ఉదయం మోంతా తుఫానుగా మారనుందని తెలుస్తోంది. ఈ నెల 29న కళింగపట్నం, మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుఫాను ప్రభావంతో కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం :

కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్‌ సేఫ్టీ వీడియో

ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో

ల్యాప్‌టాప్స్‌ చార్జింగ్‌ పెట్టడంతో వీడియో