Cyclone Michaung: తిరుమలలో తుపాన్ ఎఫెక్ట్.. భారీ వర్షం, ఈదురు గాలులు

|

Dec 05, 2023 | 9:43 PM

మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో రెండు రోజులుగా తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో శ్రీవారి భక్తులు, యాత్రికులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తిరుమలలో దాదాపు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మరోవైపు చలి గాలుల తీవ్రత కొనసాగుతోంది. దీనికి తోడు తుఫాను ప్రభావంతో గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. కొండపై మంచు కమ్ముకోవడం, దీంతో పాటు భారీ వర్షాలు పడుతుండటంతో తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో రెండు రోజులుగా తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో శ్రీవారి భక్తులు, యాత్రికులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తిరుమలలో దాదాపు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మరోవైపు చలి గాలుల తీవ్రత కొనసాగుతోంది. దీనికి తోడు తుఫాను ప్రభావంతో గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. కొండపై మంచు కమ్ముకోవడం, దీంతో పాటు భారీ వర్షాలు పడుతుండటంతో తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బలమైన ఈదురు గాలులు, వర్షానికి తిరుమలలోని పలు ప్రాంతాలలో చెట్లు కొమ్మలు, విరిగి పడ్డాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. శ్రీవారి పాదాలకు వెళ్ళే మార్గాలకు అనుమతి నిరాకరించారు టీటీడీ అధికారులు. ఘాట్ రోడ్డు ద్వారా వెళ్లే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించి, టర్నింగ్‌ దగ్గర జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. అటు తిరుమలలో పడుతున్న భారీ వర్షాలకు గోగర్భం, పాపవినాశనం, పసుపుధార, ఆకాశగంగ జలాశయాలకు భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: క్లీన్‌గా హాయ్‌ నాన్నా..| గెట్ రెడీ ఫర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్

బద్దలైన అగ్ని పర్వతం.. 11 మంది మృతి

Follow us on