రామయ్య తండ్రికి గోటి తలంబ్రాల కోసం పంట కోతలు..

|

Dec 18, 2023 | 7:25 PM

భద్రాద్రి రామయ్య కళ్యానానికి గోటి తలంబ్రాలు సిద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారు రామభక్తులు. ప్రతి ఏటా కోరుకొండనుంచి భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్య దేవాలయాల్లో శ్రీసీతారామ కళ్యాణానికి ప్రత్యేకంగా చేతితో ఒలిచిన కోటి గోటి తలంబ్రాలు కానుకగా పంపిస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా రామ పంట పేరుతో ప్రత్యేకంగా వరిని పండిస్తారు. కోతకొచ్చిన ఆ పంటను ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనామస్మరణతో కోసి, కుప్పనూర్చి ధాన్యం రాశిపోస్తారు.

భద్రాద్రి రామయ్య కళ్యానానికి గోటి తలంబ్రాలు సిద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నారు రామభక్తులు. ప్రతి ఏటా కోరుకొండనుంచి భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్య దేవాలయాల్లో శ్రీసీతారామ కళ్యాణానికి ప్రత్యేకంగా చేతితో ఒలిచిన కోటి గోటి తలంబ్రాలు కానుకగా పంపిస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా రామ పంట పేరుతో ప్రత్యేకంగా వరిని పండిస్తారు. కోతకొచ్చిన ఆ పంటను ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనామస్మరణతో కోసి, కుప్పనూర్చి ధాన్యం రాశిపోస్తారు. వాటిని శ్రీరామనామ జపంచేస్తూ గోటితో ఒలుస్తారు. తాజాగా అదే పనిలో పడ్డారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, అచ్యుతాపురానికి చెందిన రామ భక్తులు. భద్రాద్రి రామయ్యకు గోటితలంబ్రాలు సిద్ధం చేసేందుకు శ్రీకారం చుట్టారు. వానర వేషధారణలో రైతులు రామపంటను కోత కోశారు. శ్రీరాముడు, సుగ్రీవుడు ,హనుమంతుడు, జాంబవంతుడు, హనుమంతుని వేషధారణలో సాగిన కోటి తలంబ్రాల పంట కోతలు చూపరులను ఆకట్టుకున్నాయి. దాదాపు 3 నెలలు శ్రమించి పంట పండించి.. 8వందల కేజీలు ధాన్యాన్ని గోటితో వలిచి .. కోటి తలంబ్రాలు తయారు చేస్తారు. ఈ కోటి తలంబ్రాల తయారీలో 60 గ్రామాల్లోని రామభక్తులు పాల్గొంటారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు కేంద్రం అలర్ట్‌ !!

మంచు దుప్పటి కప్పుకున్న మన్యం జిల్లా.. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

రైతన్నలను అల్లాడిస్తున్న కృష్ణ జింకలు