Kukatpally: నా కూతుర్ని చంపేసినవాడికి బతికే హక్కులేదు.. సహస్ర తండ్రి సంచలన వ్యాఖ్యలు
కూకట్‌పల్లిలో బాలిక హత్యకేసుపై పోలీసుల ప్రెస్‌మీట్ పెట్టారు. నెల క్రితమే నిందితుడు ప్లాన్ చేశాడని డీసీపీ సురేష్ అన్నారు. బ్యాట్ కోసమే బాలిక ఇంటికి వెళ్లానని నిందితుడు చెప్పాడన్నారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బు గురించి చెప్పడం లేదని చెప్పారు. బ్యాట్ తీసుకొని వెళ్తుండగా బాలిక అడ్డుకుంది.. ఆపై.!
తన కూతురిని చంపిన బాలుడ్ని వదలొద్దని సహస్ర తండ్రి కృష్ణ అన్నారు. అన్యాయంగా తన కూతుర్ని పొట్టనపెట్టుకున్నాడని వాపోయారు. పక్కా ప్లాన్ చేసుకుని దొంగతనానికి వచ్చాడని..అడ్డొచ్చిన తన కూతుర్ని చంపేశాడని టీవీ9తో అన్నారు సహస్ర తండ్రి కృష్ణ. తన కూతుర్ని చంపేసినవాడికి బతికే హక్కు లేదు. హంతకుడు బాలుడు కాదు.. పెద్దవాడే అని చెబుతున్నారాయన. సహస్రను చంపిన వాడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.
అటు సహస్రను చంపిన బాలుడ్ని విడిచిపెట్టొద్దని డిమాండ్ చేశారు పెదనాన్న యాదయ్య. సహస్రలాగే బాలుడ్ని కూడా శిక్షించాలన్నారు. చిన్న వయసులో ఇంత క్రిమినల్ మైండ్ ఉందని.. రేపు బయటకు వస్తే మరో ఘోరం చేయరన్న గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. తమ బిడ్డలతో రోజూ ఆడుకుంటూ.. చివరకు సహస్ర పాలిట యముడిలా మారాడన్నారు యాదయ్య. బాలుడు కేవలం దొంగతనం కోసమే వచ్చాడని, సహస్ర అరిచిందనే చంపేశాడని చెబుతున్నారు.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

