ఆ అధికారుల ఇంట్లో తవ్వేకొద్దీ బయటపడుతున్న అవినీతి సంపద

Updated on: Oct 17, 2025 | 9:58 PM

ఇద్దరు ఉన్నతాధికారుల ఇళ్లపై సీబీఐ దాడులు చేసి భారీగా అక్రమాస్తులను వెలికితీసింది. పంజాబ్ డీఐజీ హరిచరణ్ సింగ్ భుల్లర్, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రితేన్ కుమార్ సింగ్‌ల నివాసాల్లో కోట్లాది రూపాయల నగదు, బంగారం, లగ్జరీ కార్లు, ఖరీదైన గడియారాలు, అపార్ట్‌మెంట్‌లతో పాటు ఆస్తుల పత్రాలు కుప్పలుతెప్పలుగా బయటపడ్డాయి. వీరిద్దరూ లంచాలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

అవినీతికి పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారుల ఇళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దాడులు నిర్వహించి భారీగా అక్రమాస్తులను వెలికితీసింది. పంజాబ్ డీఐజీ హరిచరణ్ సింగ్ భుల్లర్, గౌహతిలోని ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రితేన్ కుమార్ సింగ్‌ల నివాసాల్లో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో కోట్లాది రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం, ఖరీదైన లగ్జరీ గడియారాలు, విదేశీ మద్యం, ఆయుధాలు, విలాసవంతమైన కార్లు, వివిధ నగరాల్లో ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌లు, వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. డీఐజీ భుల్లర్ ఇంటి నుంచి 5 కోట్ల రూపాయల నగదు, ఒకటిన్నర కిలోల బంగారం, 22 ఖరీదైన గడియారాలు, రెండు లగ్జరీ కార్లు లభించాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశంలో నకిలీ ORS బ్యాన్.. పోరాడి గెలిచిన డా.శివరంజని

గ్రీన్ క్రాకర్స్ తో కాలుష్యానికి చెక్..మరి వాటిని గుర్తుపట్టడం

విశాఖలో అతి పెద్ద ‘గూగుల్ ఏఐ హబ్’

ఒక్క రోజులోనే రూ.3,770 పెరిగిన బంగారం.. శుక్రవారం తులం బంగారం ఎంతంటే ??

శేషాచలంలో అరుదైన ప్రాణులు