రూ.25,000 కోట్లు ఏమవుతాయ్.? సుభ్రతారాయ్ మరణంతో ఆలోచనలో దిగ్గజాలు.
సుభ్రతారాయ్ మరణం సామాన్యులనుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకూ విచిత్రమైన ఆలోచనలో పడేసింది. 200 రూపాయలతో వ్యాపార రంగంలో అడుగు పెట్టిన ఆయన ఒక్కో ఇటుకు పేర్చి, అందివచ్చిన అవకాశాలను మెట్లుగా మార్చుకొని 2.5 లక్షల కోట్ల కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలాంటి వ్యాపారవేత్త తీహార్ జైలు పాలవుతారని ఎవరైనా అనుకుంటారా? కోట్ల కొద్దీ మదుపర్ల పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను వందకు పైగా ట్రక్కుల్లో పత్రాలుగా పంపడం చూశారా?
సుభ్రతారాయ్ మరణం సామాన్యులనుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకూ విచిత్రమైన ఆలోచనలో పడేసింది. 200 రూపాయలతో వ్యాపార రంగంలో అడుగు పెట్టిన ఆయన ఒక్కో ఇటుకు పేర్చి, అందివచ్చిన అవకాశాలను మెట్లుగా మార్చుకొని 2.5 లక్షల కోట్ల కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలాంటి వ్యాపారవేత్త తీహార్ జైలు పాలవుతారని ఎవరైనా అనుకుంటారా? కోట్ల కొద్దీ మదుపర్ల పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను వందకు పైగా ట్రక్కుల్లో పత్రాలుగా పంపడం చూశారా? దాదాపు 25,000 కోట్లను సెబీ వద్ద డిపాజిట్ చేసారు సుబ్రతా రాయ్. ఆ కేసు విషయం తేలకుండానే మరణించడంతో ఈ నిధులు ఏమవుతాయోనని సర్వత్రా చర్చించుకుంటున్నారు. 1978లో 2,000 రూపాయల పెట్టుబడితో మొదలైన ఆయన వ్యాపారం ముప్పై ఏళ్లలో వేలకోట్ల వ్యాపారంగా విస్తరించారు. సామాన్య మదుపరి నుంచి సేకరించిన పది, ఇరవై రూపాయలు కూడా అందులోఉన్నాయి. ఇలా సమీకరించిన నిధులపై కేసులు మొదలయ్యాక, కోర్టులు, నియంత్రణ సంస్థల ముందుకు వెళ్లాల్సి వచ్చింది. మదుపర్ల మొత్తం డబ్బులు వెనక్కి ఇస్తామని ఆయన చివరి వరకు చెబుతూనే వచ్చారు. ఎవరి నుంచి నిధులు సేకరించారనేందుకు ఆధారాలు అడిగితే.. ఏకంగా 128 ట్రక్కుల నిండా 31,000 బాక్సుల్లో పత్రాలను సెబీకి పంపారు. ఈ కేసుల్లో చిక్కుకోక ముందు.. ఆర్థిక సేవలు, స్థిరాస్తి, విమానయానం వంటి సేవలందించిందీ సహారా గ్రూప్. రెండే రెండు ఫిర్యాదులు సుబ్రతా రాయ్ కార్పొరేట్ సామ్రాజ్యానికి బీటలు వారేలా చేశాయి. 2009 డిసెంబరు 25లో ప్రొఫెషనల్ గ్రూప్ ఫర్ ఇన్వెస్టర్ ప్రొటక్షన్ నుంచి సెబీకి ఫిర్యాదు అందింది.
చాలా నెలలుగా ప్రజలకు కన్వర్టబుల్ బాండ్లను జారీ చేసి నగదు సేకరించినా.. ఆ వివరాలను ముసాయిదాలో పేర్కొనలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే తరహాలో రోషన్ లాల్ నుంచి కూడా 2010 జనవరి 4న లేఖ వచ్చింది. ఒకటిన్నర పేజీల్లో హిందీలో రాసిన ఆ లేఖ దేశంలో దుమారాన్నే రేపింది. ఆ తరవాత సరిగ్గా నాలుగేళ్ల మూడు నెలలకు తీహార్ జైలుకు రాయ్ వెళ్లాల్సి వచ్చింది. సెబీ దర్యాప్తు చేపట్టిన అనంతరం, కేసు అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుదాకా వెళ్లింది. తాము ఎటువంటి తప్పు చేయలేదని, హామీ ఇచ్చిన ప్రతిఫలాలతో అందరి డబ్బులను వెనక్కి ఇస్తామని సహారా గ్రూప్ చెబుతూ వచ్చింది. అదే సమయంలో మదుపర్ల నుంచి నిధులు సేకరిస్తూనే ఉంది. మొత్తం 3.1 కోట్ల మంది మదుపర్లు కంపెనీ బాండ్లు కొనుగోలు చేశారు. సుబ్రతా రాయ్ మరణంతో ఇపుడు మదుపర్లకు చెల్లించాల్సిన నిధుల పరిస్థితి ఏమిటన్న విషయాన్ని అందరూ చర్చించుకుంటున్నారు. 25,000 కోట్ల వరకు మొత్తాన్ని సెబీ వద్ద సహారా గ్రూప్ డిపాజిట్ చేసింది. తాజా గణాంకాల ప్రకారం.. సెబీ ఇప్పటిదాకా 138 కోట్లను మదుపర్లకు వెనక్కి ఇచ్చింది. వడ్డీతో కలిసి ఇంకా సెబీ అజమాయిషీలోని ఖాతాలో 25,000 కోట్లు ఉన్నాయి. అయితే, 95% మంది మదుపర్లకు నేరుగా రిఫండ్ చేశామని సహారా పేర్కొన్నప్పటికీ.. సుప్రీం ఆదేశాలతో ఈ నిధులనూ సెబీ వద్ద జమ చేయాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాలతో 2014 మార్చి 2న తీహార్ జైలుకు వెళ్లిన రాయ్, రెండేళ్ల పాటు అక్కడే ఉన్నారు. ఆయన తల్లి చాబి రాయ్ అంత్యక్రియల కోసం 2016 మే 6న బయటకు వచ్చారు. అప్పటి నుంచీ పెరోల్‌పై బయటే ఉన్నారు. మంగళవారం రాయ్ గుండెపోటుతో మరణించడంతో సహారా గ్రూప్ విషాదంలో మునిగిపోయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.