CM Chandrababu: అభిమాని ఇచ్చిన అరుదైన గిఫ్ట్‌కు సీఎం చంద్రబాబు ఫిదా

CM Chandrababu: అభిమాని ఇచ్చిన అరుదైన గిఫ్ట్‌కు సీఎం చంద్రబాబు ఫిదా

Pvv Satyanarayana

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 24, 2024 | 11:32 AM

అభిమాని ఇచ్చిన అరుదైన గిఫ్ట్‌ సీఎం చంద్రబాబు ఫిదా అయ్యారు. ఏకంగా అతనికి దగ్గరికి పిలిపించుకుని ఫోటో తీయించుకున్నారు. దీంతో ఆ అభిమాని ఆనందం అంతా ఇంతా కాదు. వీడియో చూద్దాం పదండి.

అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లి గ్రామ సభకు వచ్చిన చంద్రబాబుకు అభిమాని అరుదైన బహుమతి ఇచ్చారు. ఆ గిఫ్ట్ చూసి సీఎం ఫిదా అయ్యారు. ఏకంగా దగ్గరకు పిలిపించుకుని ఫోటో తీయించుకున్నారు చంద్రబాబు.  మూడు సింహాల సింబల్‌లో..  ఒక తలకు ప్రధాని మోడీ… రెండవ తలకు సీఎం చంద్రబాబు.. మూడవ తలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను గీసిన ఆర్ట్.. ముఖ్యమంత్రిని ఆకట్టుకుంది. అంతేకాకుండా ఆ ఫోటో పైన ఓం నమో నారా వారాహి నమః అంటూ కొటేషన్ రాశాడు ఆ అభిమాని. ఆ ఫోటోను చూడగానే చంద్రబాబు ఆ అభిమానిని దగ్గరకు పిలిపించుకుని అతనితో ఫోటో తీయించుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

 

 

Published on: Aug 24, 2024 11:30 AM