Viral: తన ల్యాప్‌టాప్‌ను పబ్లిక్ మధ్య పెట్టి వెళ్లాడు.. ఏం జరిగిందంటే?
రద్దీ ప్రదేశంలో ఓ ఖరీదైన ల్యాప్‌టాప్‌ను అరగంట పాటు వదిలేస్తే ఏమవుతుంది? కచ్చితంగా మాయమవుతుంది. కానీ చైనాలో ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు పూర్తి భిన్నమైన అనుభవం ఎదురైంది. అక్కడి ప్రజా భద్రత, ప్రజల నమ్మకాన్ని పరీక్షించేందుకు అతను చేసిన ఓ ప్రయోగం ఇప్పుడు వైరల్‌గా మారింది.
చైనాలోని ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ టిన్‌చో, తన ల్యాప్‌టాప్‌ను రద్దీ ప్రదేశంలో 30 నిమిషాల పాటు వదిలిపెట్టి వెళ్ళాడు. ఇది ప్రజల నమ్మకాన్ని, ప్రజాభద్రతను పరీక్షించే ప్రయోగంగా అతను భావించాడు. ఆశ్చర్యకరంగా, ల్యాప్‌టాప్‌ను ఎవరూ దొంగలించలేదు. ఈ ఘటనను వీడియోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, అది వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వివిధ దేశాల ప్రజలు తమ దేశాల్లోని పరిస్థితులను పోల్చుతూ కామెంట్లు చేశారు. కొందరు తమ దేశాల్లో ఇలాంటిది జరగడం అసాధ్యమని, మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రయోగం, ప్రపంచవ్యాప్తంగా ప్రజాభద్రత, నమ్మకంపై కొత్త చర్చను రేకెత్తించింది.
Follow Us
వైరల్ వీడియోలు
మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన తొలి రాష్ట్రం
ఇక గాడిదలు కాయటం.. వారికి మాత్రం కోట్ల లో వ్యాపారం
టెక్నాలజీ అంటే ఇదేరా సామీ.. పనిదొంగను పట్టేసిన AI
వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది
ట్రెండింగ్‌లో 'బాయ్‌కాట్ చాట్‌జీపీటీ'..
జంబలకిడిపంబ హోలీ చూసారా.. !!
ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ

