AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulasa: యానాం మత్స్యకారుడి వలలో పులస.. ధర తెలిస్తే అదిరిపడతారు!

Pulasa: యానాం మత్స్యకారుడి వలలో పులస.. ధర తెలిస్తే అదిరిపడతారు!

Ram Naramaneni
|

Updated on: Sep 11, 2025 | 10:41 AM

Share

పులస చిక్కిడమే గగనమైపోయింది. ఇప్పుడు పులస వలకి చిక్కితే బంగారం చిక్కినట్లే. ఒకటో అరో వలలో పడితే.. వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఫలితంగా వేలంలో రికార్డు ధర పలుకుతుంది. కొంతమంది ఇలస చేపనే పులస చేపలుగా చెప్పి అమ్మడం మార్కెట్లలో కనిపిస్తుంది.

గోదావరిలో వరదనీరు పొంగిపొర్లుతున్నా.. పులసల జాడమాత్రం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. ఈ మధ్య పెద్దగా పులసలు చిక్కిన సమాచారం లేదు. ఎక్కడో అడపాదడపా ఒకటీ అరా తప్ప పెద్ద సఖ్యంలో పులసలు దొరికిని దాఖలాలు లేవు. తాజాగా యానాంలో ఓ మత్స్యకారుడి అదృష్టం పండింది. నీలపల్లివద్ద గౌతమి గోదావరిలో 1.115 కేజీల బరువున్న పులస చిక్కింది. ఈ పులసను దక్కించుకోడానికి చాలామంది పోటీపడ్డారు. చివరికి కాకినాడకు చెందిన ఓ వ్యక్తి రూ. 26 వేల రూపాయలకు కోనుగోలు చేసి పులసను కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది సాధారణంగా కేజీన్నర బరువున్న పులసలు మాత్రమే రూ.25 వేల రూపాయలు ధర పలుకుతోంది. కానీ కేజీమీద 100 గ్రాములు ఎక్కువ ఉన్న ఈ పులస కూడా అదే ధర పలకడం విశేషం. హైదరాబాద్ వంటి నగరాల నుంచి కొందరు దళారుల సహకారంతో కొనుగోలు చేస్తుండటం, లభ్యత తగ్గిపోవడంతో చిన్న చేపలకూ భారీ ధర లభిస్తున్నట్లు స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేవ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Sep 11, 2025 10:41 AM
Follow Us