మావోయిస్టుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ప్లాన్ వీడియో

Updated on: Oct 20, 2025 | 3:23 PM

మావోయిస్టు రహిత భారత్‌ లక్ష్యంగా కేంద్రం రెండంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే లొంగుబాట్లను ప్రోత్సహించిన కేంద్రం, ఇప్పుడు ప్లాన్ బీ కింద మావోయిస్టుల ఆర్థిక మూలాలపై ఈడీ ద్వారా దృష్టి సారించింది. PLFI సంస్థ అధినేత దినేష్‌తో సహా 19 మందిపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది, తద్వారా నిధుల ప్రవాహాన్ని అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్‌ను మావోయిస్ట్ రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాన్ని మరింత బలోపేతం చేసింది. గతంలో మావోయిస్టులను లొంగిపోయేలా ప్రోత్సహించిన “ప్లాన్ ఏ” విజయవంతం కావడంతో, ఇప్పుడు రెండంచెల విధానంలో “ప్లాన్ బీ”ను అమలు చేస్తోంది. ఈ కొత్త ప్రణాళికలో భాగంగా, మావోయిస్టుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడంపై దృష్టి సారించింది.ఈ వ్యూహంలో భాగంగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మావోయిస్టులకు ఆర్థిక వనరులను సమకూర్చే సంస్థలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా, PLFI (పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) అధినేత దినేష్‌తో పాటు ఆయనకు చెందిన 19 మంది అనుచరులపై మనీలాండరింగ్ అభియోగాలపై కేసు నమోదు చేసింది.

మరిన్ని వీడియోల కోసం :

నేనెవరో తెలుసా? నా బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసా?

హైదరాబాద్‌ బిర్యానీ కోసం బిహార్‌లో ఫైటింగ్‌ వీడియో

ఇదేందిరా మామ ఇలా ఉన్నాడు.. భార్యపై కోపంతో ఏకంగా అత్తింటికే నిప్పు పెట్టాడుగా

డ్యాన్స్‌లో మామ మల్లారెడ్డితో పోటీపడ్డ కోడలు ప్రీతిరెడ్డి వీడియో