మార్చి 15 తర్వాత పేటీఎం క్యూఆర్ కోడ్‌లు, సౌండ్ బాక్సులు పనిచేస్తాయా

|

Feb 19, 2024 | 8:33 PM

మార్చి 15 తర్వాత పేటీఎం క్యూఆర్‌ కోడ్‌లు పనిచేయవా? అంటే అవుననే అనిపిపిస్తోంది. మార్గదర్శకాలను ఉల్లంఘించి విదేశీ లావాదేవీలు నిర్వహించిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29 నుంచి సేవలను నిలిపివేయాలంటూ గతంలో ఆదేశించిన ఆర్బీఐ.. కాస్త ఉపశమనాన్ని కల్పిస్తూ మార్చి 15 వరకు గడువుని పెంచింది. ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన వెలువరించింది.

మార్చి 15 తర్వాత పేటీఎం క్యూఆర్‌ కోడ్‌లు పనిచేయవా? అంటే అవుననే అనిపిపిస్తోంది. మార్గదర్శకాలను ఉల్లంఘించి విదేశీ లావాదేవీలు నిర్వహించిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29 నుంచి సేవలను నిలిపివేయాలంటూ గతంలో ఆదేశించిన ఆర్బీఐ.. కాస్త ఉపశమనాన్ని కల్పిస్తూ మార్చి 15 వరకు గడువుని పెంచింది. ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన వెలువరించింది. కార్యకలాపాల నిలిపివేతకు గడువుని పొడగించడం కస్టమర్లకు కొంతమేరకు లాభదాయకమనే చెప్పాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్న కస్టమర్లకు గడువు పెంపు ఉపశమనం కల్పించనుందని ఆర్బీఐ పేర్కొంది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ తన కార్యకలాపాలను సజావుగా కొనసాగించడానికి వీలుగా నూతన వ్యాపార భాగస్వామిని ఏర్పాటు చేసుకునేందుకు ఆర్బీఐ నిర్ణయం ఉపయోగపడనుంది. వ్యాపారులకు నిరంతరాయ లావాదేవీల సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా పేటీఎం పేమెంట్స్ మాతృసంస్థ పేటీఎం ఇప్పటికే తన అకౌంట్లను కొత్త బ్యాంక్‌కి మార్చేందుకు సిద్ధమైంది. మరోవైపు పేటీఎం క్యూఆర్ కోడ్‌లు, సౌండ్‌బాక్స్‌లు, కార్డ్ మెషీన్‌లు మార్చి 15 తర్వాత కూడా సజావుగా పనిచేస్తాయని యూజర్లకు పేటీఎం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్ సిలిండర్ లో నీళ్లు.. ఎందుకొచ్చాయ్ ?? ఎలా వచ్చాయ్ ??

టికెట్‌ లేకుండా విమానం ఎక్కేసింది.. ఆ తర్వాత ??

ఇంటి గుమ్మంలో నల్ల చిరుత… ఇంతకీ తలుపు కొట్టిందా ?? లేదా ??

వందే భారత్‌ రైలుకు “కవచ్‌” రక్ష.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, పాల్వాల్‌ మధ్య పరీక్ష