Fixed Deposit: మీకు ఏ రకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ సరైనదో తెలుసా? పన్ను ఆదా.. ఎలాంటి వడ్డీ రేట్లు!

Fixed Deposit: మీకు ఏ రకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ సరైనదో తెలుసా? పన్ను ఆదా.. ఎలాంటి వడ్డీ రేట్లు!

Subhash Goud

|

Updated on: Mar 22, 2024 | 1:18 PM

ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే FD ద్వారా, మీరు మీ డబ్బును నిర్ణీత కాలానికి పెట్టుబడి పెట్టడం. దీనితో, మీ డబ్బు డిపాజిట్ అయ్యి ఉంటుంది. మీరు దానిపై స్థిరమైన వడ్డీని కూడా పొందుతారు. రిస్క్ తీసుకోకూడదనుకునే వారికి FD మంచి పెట్టుబడి ఆప్షన్. కానీ అందరికీ వేర్వేరు ఇన్వెస్ట్ మెంట్ గోల్స్ ఉంటాయి. దానికి అనుగుణంగా మీ కోసం సరైన FDని ఎంచుకోవడం చాలా ముఖ్యం. నిజానికి అనేక రకాల

ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే FD ద్వారా, మీరు మీ డబ్బును నిర్ణీత కాలానికి పెట్టుబడి పెట్టడం. దీనితో, మీ డబ్బు డిపాజిట్ అయ్యి ఉంటుంది. మీరు దానిపై స్థిరమైన వడ్డీని కూడా పొందుతారు. రిస్క్ తీసుకోకూడదనుకునే వారికి FD మంచి పెట్టుబడి ఆప్షన్. కానీ అందరికీ వేర్వేరు ఇన్వెస్ట్ మెంట్ గోల్స్ ఉంటాయి. దానికి అనుగుణంగా మీ కోసం సరైన FDని ఎంచుకోవడం చాలా ముఖ్యం. నిజానికి అనేక రకాల ఎఫ్‌డిలు అందుబాటులో ఉన్నాయి. ఏ ఎఫ్‌డిలో ఇన్వెస్ట్ చేయాలనే నిర్ణయాన్ని.. దాని వల్ల కలిగే లాభనష్టాలను అర్థం చేసుకున్న తర్వాత తీసుకోవాలి. కాబట్టి వివిధ ఎఫ్‌డిల గురించి చూస్తే.. ముందుగా, రెగ్యులర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ గురించి చెప్పుకుందాం. ఇది సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం. ఈ స్కీమ్ నిబంధనల ప్రకారం నెలవారీ, త్రైమాసికం, అర్ధ-సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన వడ్డీని తీసుకోవచ్చు. ఈ రకమైన FDలో, 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. వడ్డీ రేటు బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్ కంటే ఎక్కువ. ఈ డిపాజిట్‌పై లోన్, ఓవర్‌డ్రాఫ్ట్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మెచ్యూరిటీకి ముందే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇలా చేస్తే.. వడ్డీ తగ్గిపోతుంది. దానివల్ల నష్టం తప్పదు. మీరు పన్నును ఆదా చేయాలనుకుంటే, ట్యాక్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. ఇన్వెస్ట్ మెంట్ కు సరైన ఆప్షన్. దీనికి 5 ఏళ్ల లాక్-ఇన్ పిరియడ్ ఉంటుంది. వడ్డీ రేట్లు సాధారణ FD లాగా ఉంటాయి. కానీ మెచ్యూరిటీకి ముందు దీని నుంచి డబ్బును విత్ డ్రా చేయలేం. అయితే మీకు ఏ రకమైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సరైనదో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..