భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే

Updated on: Nov 25, 2025 | 10:06 PM

దేశంలో బంగారం, వెండి ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1910 పెరిగి, రూ. 1,27,040కి చేరుకోగా, వెండి ధర కేజీకి రూ.4000 పెరిగి రూ.1,67,000కి చేరింది. గత కొన్ని రోజులుగా తగ్గిన ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులకు షాకిచ్చింది. కొనుగోలుకు ముందు నేటి ధరలను తనిఖీ చేయడం ఉత్తమం.

దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి షాకిచ్చాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు మంగళవారం మళ్ళీ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.1910 పెరిగి, రూ. 1,27,040 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,750 పెరిగి, రూ. 1,16,450 గా కొనసాగుతోంది. ఇక వెండి కూడా భారీగానే పెరిగింది. కేజీ వెండిపై రూ.4000 పెరిగి రూ.1,67,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం రూ. 1,27,190, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,600 గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ. 1,27,040, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,450 గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,860, 22 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.1,17,200 పలుకుతోంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,040, 22 క్యారెట్ల బంగారం రూ. 1,16,450 గా కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,040, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,16,450 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.1,67,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు మధ్యాహ్నం 12 గంటల తర్వాత నమోదైనవి. ఇవి తరువాత పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌ చేసుకుని వెళ్లడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

24 గంటల్లో తుఫాన్ వణుకుతున్న తీర ప్రాంతం

Mahavatar Narasimha: ఆస్కార్ బరిలో మహావతార్‌ నరసింహ

Keerthy Suresh: తన వీక్‌నెస్ ఏంటో బయటపెట్టిన కీర్తీ సురేష్‌

TOP 9 ET News: యూట్యూబ్‌పై అఖండ సర్జికల్ స్ట్రైక్.. బాలయ్యా.. మజాకా !!

6,6,6,6,6,6… సిక్సర్ల సునామీ.. 12 బంతుల్లో 50 రన్స్

Published on: Nov 25, 2025 10:05 PM