Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంత అంటే ??
పండుగల సీజన్ డిమాండ్, అంతర్జాతీయ పరిణామాలతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. రెండు రోజుల స్థిరత్వం తర్వాత సోమవారం నుంచి పెరుగుదల కొనసాగుతోంది. మంగళవారం 24K, 22K బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. కొనుగోలుకు ముందు నేటి ధరలను సరిచూసుకోవడం మంచిది.
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. రెండు రోజుల పాటు స్థిరంగా కొనసాగిన ధరలు.. సోమవారం నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం గోల్డ్ రేట్లు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు బిగ్ షాకిచ్చాయి. పండుగల సీజన్ కావడంతో గోల్డ్‌కు డిమాండ్ పెరిగింది. దీనితో పాటు అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరుగుతుండటంతో.. భారత్‌లో కూడా వీటి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,400 పెరిగి రూ.1,38,550లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,200 పెరిగి రూ. 1,27,000 పలుకుతోంది. వెండి కిలోకి రూ.3000 పెరిగి రూ.2,34,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలుఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,38,700 , పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,150 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,550 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,27,000 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,310, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,700 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,550 , 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,38,550 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,27,000 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.2,34,000 పలుకుతోంది. ఈ ధరలు మధ్యాహ్నం 1 గంటకు నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Report: చలి పంజా.. వణుకుతున్న తెలంగాణ
Peddi: పెద్దితో పోటీ.. అంత ఈజీ కాదు
TOP 9 ET News: బాహుబలి-2 రికార్డ్‌ను బద్దలు కొట్టిన ధురంధర్
కొత్త ఏడాదిలోనూ బంగారం ధర.. పైపైకే అంచనావేసిన ఆర్థిక సంస్థలు
