Gold Price: బంగారం రేటు తగ్గింది.. ఇవాళ తులం ఎంతంటే ??
ఇటీవల కాలంలో బంగారం ధర భారీగా దూసుకెళ్లింది. నాన్ స్టాప్‌గా రికార్డు స్థాయిలో పెరిగిన పసిడి ధర ఏకంగా లక్షా 30 వేల మార్క్ దాటేసింది. ఇప్పుడు పసిడి కాస్త శాంతిస్తోంది. నవంబరు 4 మంగళవారం 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల పసిడిపై రూ.710 మేర తగ్గి రూ.1,22,460 లు పలుకుతోంది. 2 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములుపై రూ.650 తగ్గి.. రూ.1,12,250 గా కొనసాగుతోంది.
వెండి కిలోకి రూ.3000 తగ్గి రూ.1,51,000 లుగా ఉంది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్ ధర తగ్గడంతో దేశీయంగా బంగారం ధరలు పతనమవుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో మంగళవారం పసిడిధరలు ఎలాఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,22,510, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,400 గా ఉంది. కిలో ధర రూ.1,51,000లుగా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,460 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,12,250 పలుకుతోంది.ధర రూ.1,51,000 లుగా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,730, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,500 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,65,000లుగా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,250 గా ఉంది. వెండి కిలో రూ.1,51,000లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,22,460 ఉంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,250 గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,65,000 లుగా ఉంది. ఈ ధరలు ఉదయం 11 గంటలకు నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Earth Quake: విశాఖలో భూప్రకంపనలు..భయంతో జనం పరుగులు
Bigg Boss Madhuri: మాధురి రెమ్యూనరేషన్ ఎంతంటే ??
Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్‌కు ఛాన్స్ అంటే.. లైంగిక వేధింపులను లైసెన్స్ ఇచ్చినట్లే
Allu Arjun: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌పై అల్లు అర్జున్ ఎమోషనల్
Allu Sirish: నితిన్ భార్య వల్లే.. ప్రేమలో పడ్డా.. లవ్‌స్టోరీ వివరించిన అల్లు వారబ్బాయి
