దీపావళి తరువాత వెండి ధర పెరుగుతుందా? తగ్గుతుందా?

Updated on: Oct 18, 2025 | 2:08 PM

దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా? పండుగ సీజన్ ముగిసిన తర్వాత వెండి ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెండి ధరల్లో గత ఏడాదితో పోలిస్తే భారీ పెరుగుదల కనిపిస్తోంది. గత దీపావళి సీజన్‌లో 10 గ్రాముల వెండి ధర రూ.1,100 ఉండగా, ఈ ఏడాది అదే సమయానికి దాదాపు రెండింతలు పెరిగి రూ.2,000 దాటింది.

ప్రపంచవ్యాప్తంగా వెండి నిల్వలు తగ్గిపోవడం, మైనింగ్ కార్యకలాపాలు మందగించడం, పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడం వంటి కారణాలు ఈ పెరుగుదల వెనుక ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వెండి కొనాలనుకుంటున్న వారు దీపావళి తర్వాతి వరకు ఆగాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ధనత్రయోదశికి మూడు రోజుల ముందు నుంచి వెండి ధర తగ్గుతోంది. సాధారణంగా వెండి ధరలు పెరగడానికి అనేక ముఖ్య కారణాలున్నాయి. వెండిని ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్,సెమీకండక్టర్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త పరిశ్రమల నుంచి వస్తున్న డిమాండ్ వెండి ధరను పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఉన్నందున.. పెట్టుబడిదారులు తమ డబ్బు విలువను కాపాడుకోవడానికి వెండిని సురక్షితమైన ఆస్తిగా కొనుగోలు చేస్తున్నారు. ఉక్రెయిన్ వంటి ప్రాంతాలలో జరుగుతున్న యుద్ధాల కారణంగా కూడా పెట్టుబడిదారులు సురక్షిత లోహాల వైపు మళ్లుతున్నారు. పండుగ డిమాండ్ తగ్గిన తర్వాత మార్కెట్ సాధారణ స్థితికి రావడం ప్రారంభిస్తుందని అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులు లాభాలు తీసుకోవడం లేదా ప్రపంచ ఉద్రిక్తతలు తగ్గడం వంటి కారణాలతో వెండి ధరలు తగ్గే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 10 నుంచి 20శాతం వరకు ధరలు తగ్గే అవకాశం ఉందన్న అంచనాలూ ఉన్నాయి. కానీ వీటిలో పెట్టుబడి పెట్టేముందు అర్హులైన కలిగిన నిపుణుల సలహాలను తీసుకోవాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉపరితల ఆవర్తనంతో ఏపీ,తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు

TOP 9 ET News: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బర్త్‌ డే సర్‌ప్రైజ్‌

బిగ్ బాస్‌కు బిగ్ ఝలక్.. ఆ ఇద్దరి వల్ల పీకల్లోతు చిక్కుల్లో షో

అవాక్కయే న్యూస్… వేణు ఎల్లమ్మ సినిమాలో హీరోగా దేవి