ATMలలో రూ. 500 ఆపేస్తున్నారా ?? మార్చి 2026 డెడ్‌లైన్‌పై కేంద్రం క్లారిటీ

Updated on: Jan 07, 2026 | 5:58 PM

రూ.500 నోట్ల చలామణి నిలిపివేత, ఏటీఎంల నుంచి ఉపసంహరణ అంటూ వస్తున్న పుకార్లను ఆర్‌బీఐ, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించాయి. రూ.500 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేశాయి. పెద్ద నోట్ల రద్దు వార్తలూ నిరాధారమేనని పీఐబీ తెలిపింది. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని సూచించింది. ఏఐ ద్వారా వ్యాపించే నకిలీ వార్తలపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

కరెన్సీ నోట్లు, ఆర్‌బీఐ ఆదేశాలకు సంబంధించి నెట్టింట ఎప్పుడూ ఏదో వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా రూ.500 నోట్ల గురించి ప్రచారం జరుగుతోంది. మార్చి నాటికి ఏటీఎంల నుంచి రూ.500 నోట్లను పూర్తిగా నిలిపేయాలని బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. 500 రూపాయల నోట్లను ఏటీఎం కేంద్రాల్లో పెట్టొద్దని జరుగుతోన్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. అలాంటి ఆదేశాలేమీ ఆర్‌బీఐ నుంచి రాలేదని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా అసత్య ప్రచారమని కేంద్రంలోని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ఎక్స్ ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చింది. ‘ఆర్‌బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. రూ.500 కరెన్సీ నోట్లు ఆపేయడం జరగదు. అవి చట్టబద్ధంగానే చెల్లుబాటులో ఉంటాయి.’ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అంది. ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఏదైనా వార్తను పూర్తిగా తెలుసుకోకుండా నమ్మడం లేదా వాటిని వేరొకరికి షేర్ చేసే ముందు అధికారిక వర్గాల నుంచి ధ్రువీకరించుకోవాలని సూచించింది. పెద్ద నోట్లు చలామణిలోకి రాకుండా కట్టడి చేయాలంటూ బ్యాంకులను ఆర్‌బీఐ ఆదేశించినట్లు సైతం ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ పోస్టులు చక్కర్లు కొడుతున్న క్రమంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోసారి నోట్ల రద్దు లేదా చలామణి నుంచి ఉపసంహరణ చేపడతారేమోనని, మళ్లీ క్యాష్‌ కష్టాలు వస్తాయనే ఆందోళన పడుతున్నారు. ఈ ఆందోళనకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చెక్ పెట్టింది. అది తప్పుడు వార్తగా తేల్చేసింది. ప్రజలు వాటిని నమ్మి ఆందోళనపడొద్దని సూచించింది. ఈ మధ్య అసత్య ప్రచారాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ పెట్టుబడి ప్లాట్ ఫారం సిఫారసు చేసినట్లు వీడియోలను షేర్ చేశారు. రూ.21 వేలతో నెల రోజుల్లోనే లక్షల్లో సంపాదించవచ్చని ఆమె చెప్పినట్లు ఏఐతో వీడియోలు ఎడిట్ చేసి షేర్ చేసారు. వాటిని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఏఐ ఎడిటెడ్ వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా.. వైరల్‌గా డాక్టర్‌ పోస్ట్‌

బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్‌

చట్నీలో బల్లి.. తిన్న 8 మందికి వాంతులు, విరేచనాలు

ప్రింటింగ్‌ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్

దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా ?? ఇంద్రకీలాద్రిపై మారిన రూల్స్ తెలుసుకోండి