గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

|

Dec 12, 2024 | 8:18 PM

పెట్రోల్‌, డీజిల్‌ ధరల ప్రభావం అన్ని వ్యాపార రంగాలపై పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ధరలు ఆటుపోట్లు మార్కెట్ లో దొరికే వస్తువుల రేట్లపై పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే భారీగా డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టనున్నాయనే సూచనలు దేశ ప్రజల్లో ఆనందం నింపుతోంది.

ప్రస్తుతం ప్రజల నిత్యావసర ఖర్చుల్లో ఎక్కువగా పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చులకే ఎక్కువ కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి ధరలు రెగ్యులర్ గా పెరుగుతుండటంతో ప్రజా రవాణా భారంగా మారుతోంది. ఈ క్రమంలో పెట్రోల్‌, డీజిల్‌ను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చి, ప్రజలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధిస్తున్న విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో రానున్న కొద్దిరోజుల్లోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో భారీ మార్పు కనిపించవచ్చని, ఈ ధరలు బాగా దిగొచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం చివరిసారిగా మార్చిలో ఇంధన ధరలను రూ.2లు తగ్గించింది. అప్పటి నుంచి అవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం మరోసారి ధరలు తగ్గిస్తే.. సామాన్యులకు ఇంటి, వ్యాపార ఖర్చులు కాస్త తగ్గి, ఉపశమనం కలిగే అవకాశం ఉంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డబ్బుల కోసం యూట్యూబర్లు ఇలా కూడా చేస్తారా ??

Bleeding Eye: కరోనా కంటే డేంజర్‌.. బ్లీడింగ్ ఐ వైరస్ !!

ఆలోచన అదిరిందిపో.. కుక్కల నుంచి రక్షణకు వినూత్న ప్రయోగం !!

జలుబు, దగ్గు, గొంతునొప్పికి ఇంటి చిట్కాలు

‘పుష్ప-2’ పై ట్రోల్స్.. గట్టిగా బదులిచ్చిన జాన్వీ కపూర్ !!