కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే

|

Dec 30, 2024 | 8:01 PM

ఆర్థిక విషయాల్లో ఈ ఏడాది ఎన్నో మార్పులు వచ్చాయి. కొత్త ఏడాదిలోనూ ఈ ఒరవడి కొనసాగనుంది. కార్ల ధరలు పెరగనున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ విషయంలోనూ కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఇవన్నీ మనపై ఏదో విధంగా ప్రభావం చూపేవే. మరికొన్ని రోజుల్లో 2024కు వీడ్కోలు పలికి కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ వచ్చే మార్పులేమిటో ఇప్పుడు చూద్దాం..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో యూజర్లు ఏ డివైజ్‌ అన్న సంబంధం లేకుండా ఐదు డివైజులను ఒకేసారి వాడుకోవచ్చు. వచ్చే ఏడాది నుంచి ఈ సదుపాయం ఉండదు. జవనరి 1 నుంచి ఒకేసారి రెండు కంటే ఎక్కువ టీవీల్లో ప్రైమ్‌ వీడియో వాడేందుకు అవకాశం లేదు. ఒకవేళ వాడాల్సివస్తే కొత్త కనెక్షన్‌ తీసుకోవాల్సిందే. అయితే డివైజుల సంఖ్యలో మాత్రం ఎటువంటి మార్పూ చేయలేదు. కొత్త ఏడాదిలో పాత స్మార్ట్‌ఫోన్లకు తన మెసేజింగ్‌ సేవల్ని వాట్సప్‌ నిలిపివేయనుంది. జనవరి 1 నుంచి ఆండ్రాయిడ్‌కు చెందిన శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌3, మోటో జీ, హెచ్‌టీసీ వన్‌ఎక్స్‌, మోటో రేజర్‌ హెచ్‌డీ, ఎల్‌జీ ఆప్టిమస్‌ జీ, సోనీ ఎక్స్‌పీరియా జడ్‌ తదితర ఫోన్లకు తన సపోర్ట్‌ను నిలిపివేయనుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త !!