మీ బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉందా

Updated on: Aug 19, 2025 | 7:01 PM

ఏదైనా బ్యాంకులో ఖాతా తెరిచిన ప్రతి ఖాతాదారుడు.. తన ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలనేది అందరికీ తెలిసిన విషయమే. గతంలో..ప్రైవేట్ బ్యాంకులతో పాటు అనేక ప్రభుత్వ బ్యాంకులు కూడా ఈ రూల్ ని ఖచ్చింతంగా పాటించేవి. కానీ ఇప్పుడు చాలా ప్రభుత్వ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ రూల్ ని తీసిపారేశాయి.

అయితే..దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ..తదితర బ్యాంకులు మాత్రం..సేవింగ్స్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్‌ను గతంలో కంటే అనేక రెట్లు పెంచేసి.. ఖాతాదారులకు దడపుట్టిస్తున్నాయి. HDFC, ICICI ఇటీవల తమ పొదుపు ఖాతాలకు కనీస సగటు బ్యాలెన్స్ నియమాన్ని పెద్ద మార్పు చేశాయి. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో నివసించే కస్టమర్లు తమ ఖాతాల్లో సగటున 50,000 నిర్వహించాలని ICICI బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పరిమితి రూ. 10,000 మాత్రమే. ఇక.. ఐసీఐసీఐ సెమీ-అర్బన్ ప్రాంతాల్లో గతంలో 5 వేల మినిమం బ్యాలెన్స్ ఉంటే సరిపోయేది. కాగా, ఇప్పుడు దీనిని ఏకంగా.. రూ. 25,000కి పెంచారు. ఇక.. గ్రామీణ శాఖల్లోనూ గతంలో ఉన్న రూ.5,000 మినిమం బ్యాలెన్స్‌ను.. రూ. 10,000 కి పెంచేసింది ఐసీఐసీఐ బ్యాంకు. మరోవైపు.. HDFC బ్యాంక్ పొదుపు ఖాతాల విషయంలో గతంలో ఉన్న రూ. 10 వేల మినిమం బ్యాలెన్స్‌ను రూ.25,000కి పెంచింది. ఖాతాలో ఈ మొత్తం లేకపోతే భారీగా జరిమానా పడనుంది. అయితే.. ఆగస్టు 1, 2025 తర్వాత తెరిచిన బ్యాంకు ఖాతాలకే ఈ నియమం వర్తిస్తుంది. దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్రా.. ఖాతాదారుల సేవింగ్స్ ఖాతా రకాన్ని బట్టి రూ. 10,000 నుంచి రూ. 20,000 మధ్య మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలని నిర్దేశించింది. యాక్సిస్ బ్యాంక్ తన వినియోగదారులు సెమీ-అర్బన్ లేదా రూరల్ బ్రాంచ్‌లతో సహా అన్ని ప్రదేశాలకు నెలకు సగటున రూ. 10,000 బ్యాలెన్స్ లేదా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి కనీసం రూ. 50,000 ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను కలిగి ఉండాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదు సంవత్సరాల క్రితం..మినిమం బ్యాలెన్స్ రూల్‌ని తీసేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరోగా డైరెక్టర్ తేజ కుమారుడు.. హీరోయిన్‌గా కృష్ణ మనవరాలు

రజినీని చూపిస్తూ.. స్టార్ హీరోలకు సజ్జనార్ చురకలు

Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం ధరలు

AP Rains: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీలో హైఅలర్ట్

కలర్ తక్కువంటూ కామెంట్లు.. ఛాతీపై టాటూతో నోరుమూయించిన హీరోయిన్