అప్పు చేస్తే ఉప్పురాయి కూడా మిగలదు. మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి

|

Dec 21, 2024 | 11:50 AM

యువత.. ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడడం, అందుకోసం లోన్‌ యాప్‌లలో, మైక్రో ఫైనాన్స్‌ సంస్థల్లో అప్పులు చేయడం, తరువాత ఆ అప్పులు తీర్చలేక.. లోన్‌ యాప్‌లు, ఫైనాన్స్‌ సంస్థల వేధింపులు తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడటం జరుగుతోంది. ఈ వ్యసనాల కారణంగా ఆత్మహత్యలతోపాటు హత్యలకూ పాల్పడుతున్న ఘటనలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి.

ఇదంతా ఒక వల..దాంట్లో చాలా మంది ఆ వల లో ఇరుక్కుంటున్నారు. అయితే గతంలో నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ జాడ్యం కొంతకాలంగా పల్లెలకూ పాకుతోంది. గ్రామీణ యువత లక్ష్యంగా.. చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. సాంకేతికత పెరిగాక.. చేతిలో 5జీ స్పీడ్‌ సెల్‌ఫోన్‌ వచ్చాక.. పల్లె ప్రాంతాల్లోకీ ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్స్‌, లోన్‌యా్‌పల ద్వారా సులువుగా డబ్బులు తీసుకోవడం లాంటి విష సంస్కృతి వచ్చేసింది. దాంతో గ్రామీణ యువత పక్కదారి పడుతున్నారు. పెళ్లికోసం ఇంట్లో ఉంచిన డబ్బును, ఇళ్లు కట్టుకోవడం కోసం బ్యాంకులో దాచిన బ్యాలెన్స్‌ను, ధాన్యం అమ్మగా వచ్చిన ధనాన్ని ఆన్‌లైన్‌ ఆటలకు అప్పగించేసి, విషయం తెలిశాక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులను తీరని క్షోభకు గురిచేస్తున్నారు. యువత మాత్రమే కాకుండా.. వివాహమై కుటుంబాన్ని బాధ్యతగా నడిపించాల్సిన వారు సైతం వ్యసనాలకు బానిసలై భారంగా తనువు చాలిస్తున్నారు. కుటుంబ సభ్యులపై మోయంలేని భారం మోపుతూ, వారికీ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాజమండ్రిలో కేవలం రూ.5 కే బిర్యానీ..

నగ్నంగా రైలెక్కిన యువకుడు.. మహిళల కంపార్టుమెంట్‌లోకి వెళ్లి..

ఎక్కడికక్కడ గడ్డకట్టిన.. సరస్సులు, జలపాతాలు

ఈ విగ్గు రాజా.. విగ్గులు మారుస్తూ 50 మంది యువతులుకు మోసం

X వ్యాధి.. కరోనా కంటే 7 రెట్లు డేంజర్