Jio Updates: జియో రూ.1029 రీఛార్జ్ ప్లాన్‌లో మార్పు ఏంటంటే.?
కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటించే దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. ఇటీవలే రూ.1029 ప్లాన్‌ను సవరించింది. ఈ ప్లాన్ కింద ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్లను అందిస్తున్న కంపెనీ.. అప్‌డేట్‌లో భాగంగా కొత్తగా అమెజాన్ ప్రైమ్ లైట్‌ను యాడ్ చేసింది. దీంతో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ సేవలను కూడా వినియోగదారులు పొందవచ్చు.
కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటించే దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. ఇటీవలే రూ.1029 ప్లాన్‌ను సవరించింది. ఈ ప్లాన్ కింద ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్లను అందిస్తున్న కంపెనీ.. అప్‌డేట్‌లో భాగంగా కొత్తగా అమెజాన్ ప్రైమ్ లైట్‌ను యాడ్ చేసింది. దీంతో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ సేవలను కూడా వినియోగదారులు పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ లైట్‌లో కస్టమర్లు టీవీ లేదా మొబైల్ స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు. కాగా ఇప్పటికే అందిస్తున్న ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌లో ఒక మొబైల్ డివైజ్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది.
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌ను కోరుకునేవారికి రూ.1029 ప్లాన్ చక్కటి ఆఫర్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అపరిమిత ఉచిత కాలింగ్, ప్రతి రోజు 100 ఉచిత మెసేజులు పొందొచ్చు. ప్రతి రోజు 2 జీబీల హైస్పీడ్ డేటాను పొందవచ్చు. అంతేకాదు కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ కనెక్టివిటీ ఉంటే అపరిమిత 5జీ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు. కాగా జులై నెలలో జియో తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. జియోతో పాటు ఎయిర్‌టెల్, వొడా ఐడియా కూడా టారీఫ్ రేట్లను పెంచాయి. దీంతో చాలా మంది కస్టమర్లు ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. దీంతో కస్టమర్లను నిలబెట్టుకోవడం కోసం టెలికం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్లను ఆకర్షణీయంగా మార్చుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
డ్రగ్ టెస్ట్‌లో నటి హేమకు ‘నెగెటివ్
వృద్ధురాలికి వానరం.. కన్నీటి వీడ్కోలు
నిప్పుల కొలిమిలా ఏపీ...54 మండలాల్లో తీవ్ర వడగాలుల ముప్పు!
50 రోజులు జైల్లో 25 హోటల్లో.. 19 గంటలు బస్సులో..
పాకిస్థాన్‌లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?

