Jio – Airtel: జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..

|

Jul 05, 2024 | 4:44 PM

జియో, ఎయిర్‌టెల్ పెంచిన రీచార్జ్ ధరలు జులై 3వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. జియో తన టారిఫ్ ధరలను 12 నుంచి 25 శాతం వరకు పెంచగా, ఎయిర్‌టెల్ 11 నుంచి 21 శాతం ధరలు పెంచాయి. అయితే, ఒక చిన్న ట్రిక్‌తో పెరిగిన ధరల భారం నుంచి ఈసారికి తప్పించుకోవచ్చు. జియోలో పాపులర్ అయిన రూ. 239 ప్లాన్ ధర రేపటి నుంచి రూ. 299 కానుంది.

జియో, ఎయిర్‌టెల్ పెంచిన రీచార్జ్ ధరలు జులై 3వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. జియో తన టారిఫ్ ధరలను 12 నుంచి 25 శాతం వరకు పెంచగా, ఎయిర్‌టెల్ 11 నుంచి 21 శాతం ధరలు పెంచాయి. అయితే, ఒక చిన్న ట్రిక్‌తో పెరిగిన ధరల భారం నుంచి ఈసారికి తప్పించుకోవచ్చు. జియోలో పాపులర్ అయిన రూ. 239 ప్లాన్ ధర రేపటి నుంచి రూ. 299 కానుంది. అంటే 25 శాతం ధర పెరిగిందన్నమాట. అదే ఏడాది ప్లాన్ అయితే ఈ రెండు కంపెనీలు ఏకంగా రూ. 600 వరకు పెంచేశాయి. అయితే, ఈసారి పెరిగిన ధరల భారం నుంచి తప్పించుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ ఉపయోగిస్తే చాలు. ఇప్పటికే ఉపయోగిస్తున్న మీ ప్లాన్ యాక్టివ్‌గా ఉన్నా సరే నేటి రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా రీచార్జ్ చేసుకోవడం ద్వారా పెరిగిన భారం నుంచి బయటపడొచ్చు. జియో, ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లకు ముందుగానే రీచార్జ్ చేసుకొనే వెసులుబాటు ఉంది. మిగతా వారికి ఈ అవకాశం లేదన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి.

జియో సబ్‌స్క్రైబర్లు ఏ ప్లాన్‌తో అయినా రీచార్జ్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ఖాతాదారులు మాత్రం ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లాన్‌తోనే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసిన వెంటనే కొత్త ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ప్రస్తుతం యాక్టివేట్‌లో ఉన్న ప్లాన్ కాకుండా కొత్త ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే మాత్రం వెంటనే అది యాక్టివేట్ అయిపోతుంది. వొడాఫోన్ ఐడియా యూజర్లు మాత్రం ఇలా ముందుగా రీచార్జ్ చేసుకోలేరు. కాబట్టి వారు పెరిగిన ధరలు భరించాల్సి ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on