17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే

|

Apr 27, 2024 | 8:37 PM

సాంకేతికత లోపం వల్ల దాదాపు 17 వేల క్రెడిట్‌ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమయ్యాయి. అయితే, దీన్ని వెంటనే సవరించామని ఇప్పటి వరకు డేటాను దుర్వినియోగపర్చినట్లు తమకు సమాచారం అందలేదని బ్యాంక్‌ తెలిపింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో చూసినప్పుడు ఇప్పటికే ఉన్న కస్టమర్ ఖాతాలకు కొత్త క్రెడిట్ కార్డ్‌లు తప్పుగా అనుసంధానమయ్యాయి.

సాంకేతికత లోపం వల్ల దాదాపు 17 వేల క్రెడిట్‌ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమయ్యాయి. అయితే, దీన్ని వెంటనే సవరించామని ఇప్పటి వరకు డేటాను దుర్వినియోగపర్చినట్లు తమకు సమాచారం అందలేదని బ్యాంక్‌ తెలిపింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో చూసినప్పుడు ఇప్పటికే ఉన్న కస్టమర్ ఖాతాలకు కొత్త క్రెడిట్ కార్డ్‌లు తప్పుగా అనుసంధానమయ్యాయి. అంటే ఇప్పటికే ఉన్న కస్టమర్లు.. మరొకరి కోసం ఉద్దేశించిన కొత్త కార్డ్ వివరాలను చూడగలిగారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వగానే.. తాము అసలు దరఖాస్తు చేయకున్నా.. కొత్త కార్డ్ వివరాలు కనిపించాయని కొంతమంది సోషల్ మీడియాలో వెల్లడించారు. బుధవారం సాయంత్రం నుంచే ఈ సమస్య సోషల్‌ మీడియాలో వెలుగులోకి వచ్చింది. బ్యాంకు దీన్ని గురువారం ధ్రువీకరించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??

అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??

WhatsApp: మీరు ఇలా అడిగితే.. మేము భారత్ నుంచి నిష్క్రమిస్తాం

ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే అందులో ఉన్నది చూసి షాక్