ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ట్రాప్‌లో మీరూ పడ్డారా ?? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి
అభిమాన తారలు నటించిన సినిమా ఎప్పుడు రిలీజవుతుందా.. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే ప్రేక్షకులు కోట్లలో ఉంటారు. ఆ సినిమా చూసాక ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ను రద్దు చేయాలంటే? సైన్ అప్ చేసినంత సులభం కాదని వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంటోందని లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలింది.
దేశంలో ప్రస్తుతం 69 ఓటీటీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. చందా రద్దు ప్రక్రియ కష్టతరం చేయడానికి ప్లాట్‌ఫారాలు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను ఈ సర్వే బహిర్గతం చేసింది. ‘డార్క్ ప్యాటర్న్స్’ ఇప్పుడు వినియోగదారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటుంది. డార్క్ ప్యాటర్న్స్‌లో సబ్‌స్క్రిప్షన్ ట్రాప్ ఒకటి అనీ ఓటీటీలో సైన్ అప్ చేసే సమయంలోనే కంపెనీలు తమ తెలివిని ప్రదర్శిస్తున్నాయనీ సర్వే తేల్చింది. ఫ్రీ ట్రయల్ ఆఫర్ చేసినా.. కాల పరిమితి ముగియగానే సులభంగా బయటికొచ్చే అవకాశం లేకుండా పోతోందనీ తెలిపింది. అన్ సబ్‌స్క్రయిబ్ చేసే ఆప్షన్ గుర్తించడం కష్టంగా ఉంటోందనీ దీంతో వినియోగదారులు వారు అనుకున్న దానికంటే ఎక్కువ కాలం సభ్యత్వాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి తలెత్తుతోందని నివేదికలో స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతా నుంచి ఆటో డెబిట్ ఆప్షన్ ఉండడంతో కాల పరిమితి కాగానే ఖాతాలోంచి డబ్బులు కట్ అయిపోయి, సబ్‌స్క్రిప్షన్ రీచార్జ్ అయినట్టుగా మెసేజ్ వచ్చినట్లు చాలా మంది తెలిపారు. సబ్‌స్క్రైబ్ చేసుకునేటప్పుడు అదనపు ఛార్జీల గురించి ముందస్తుగా సమాచారం ఇవ్వడం లేదని 53% మంది వినియోగదారులు అన్నారు. చెల్లింపు చివరి దశలో మాత్రమే ఈ అదనపు ఖర్చులు కనిపిస్తున్నాయని వాపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తల్లిదండ్రులకు బిగ్ అప్డేట్.. వెంటనే అలా చేయకపోతే మీ పిల్లల ఆధార్ రద్దు!
నిర్మల్ జిల్లాలో కోడిగుడ్డు బాబా.. ఒకే ఒక్క గుడ్డుతో రోగాలన్నీ మాయం
పొట్ట తగ్గాలా ?? అయితే ఈ పండ్లు తినండి చాలు