Gold Price Today: ట్రంప్‌ ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండిధరలు!

Updated on: Jan 19, 2026 | 9:16 PM

ట్రంప్ టారిఫ్ నిర్ణయాలు, గ్రీన్‌లాండ్ వివాదం నేపథ్యంలో యూరోపియన్ దేశాలపై కొత్త సుంకాల హెచ్చరికలు పసిడి మార్కెట్‌ను కుదిపాయి. భద్రతా పెట్టుబడిగా బంగారం వైపు మళ్ళిన ఇన్వెస్టర్ల కారణంగా అంతర్జాతీయంగా, దేశీయంగా పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం 24 క్యారెట్ల బంగారం రూ.1,910, కిలో వెండి రూ.8,000 మేర పెరిగి రికార్డు స్థాయికి చేరింది. నేటి నగరాలవారీ ధరలు తెలుసుకోండి.

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలు పసిడి ప్రియులను వణికిస్తున్నాయి. గ్రీన్‌లాండ్ వివాదం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పలు యూరోపియన్ దేశాలపై కొత్తగా సుంకాలు విధిస్తామని హెచ్చరించడంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు పరుగులు పెట్టారు. దీంతో అంతర్జాతీయంగా, దేశీయంగా పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. జనవరి 19 సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,910 పెరిగి రూ.1,45,690లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 1,750లు పెరిగి రూ. 1,33,550 లు పలుకుతోంది. కేజీ వెండిపై రూ.8000 లు పెరిగి రూ.3,18,000 పలుకుతోంది. దేశీయంగా వివిధ నగరాల్లో సోమవారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,45,840 , పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,700 పలుకుతోంది. ముంబై లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,690 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,33,550 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,46,730లు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,34,500 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,45,690 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ. 1,33,550 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,45,690 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,33,550 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.3,18,000 పలుకుతోంది. ఈ ధరలు పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వణుకు పుట్టిస్తున్న పొగమంచు.. హైవేపై హెవీ ట్రాఫిక్‌ జామ్‌

గొర్రె రక్తానికి అంత పవర్ ఉందా.. అసలు నిజాలు తెలిస్తే షాకవుతారు

ఎండు చేపలను ఇష్టంగా తింటున్నారా.. డేంజర్‌ సుమా

Deepika Padukone: 40 ఏళ్లలో ఫిట్‌గా దీపిక.. రోజూ భోజనంలో ఇవి ఉండాల్సిందే

జుట్టు రాలిపోతోందా.. ఈ డ్రింక్‌ ట్రై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం