Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Updated on: Sep 15, 2025 | 7:15 PM

పసిడి ప్రియులకు స్వల్ప ఊరట దక్కింది. కొంతకాలంగా దూసుకుపోతున్న పసిడి ధరలు సోమవారం కాస్త నెమ్మదించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు కాస్త దిగిరావడం, డాలర్ విలువలో మార్పులు, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న నెగెటివిటీ మూలంగా ధరలు కాస్త తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.10 తగ్గి, రూ.1,11,160కి చేరింది.

అదే విధంగా, కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.1,32,900గా నమోదైంది. సెప్టెంబర్ 15, సోమవారం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,11,170 రూపాయిలు ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర రూ. 1,01,900 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,43,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల బంగార ధర 1,11,290, 22 కేరట్ల ధర రూ.1,02,040 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,42,900 గా ఉంది. ముంబైలో 24 కేరట్ల బంగార ధర 1,11,160, 22 కేరట్ల ధర రూ.1,01,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,42,900 గా ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,11,700 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,02,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,42,900 గా ఉంది. కోల్‌కతా 24 కేరట్ల బంగారం ధర రూ.1,11,160 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1,01,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,42,900 గా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, ఆర్థిక పరిణామాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడి, వాణిజ్య సుంకాల ప్రభావం వలన ఇన్వెస్టర్లు బంగారంపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్‌లో ఒక ఔన్స్ బంగారం ధర చరిత్రలోనే తొలిసారి 3,700 డాలర్లను దాటింది. అలాగే రానున్న పండుగ సీజన్, పెళ్లిళ్ల సీజన్ కారణంగా మాన్ దేశంలో బంగారానికి డిమాండ్ పెరగనుందని, దీనివల్ల బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘సగం టైం ట్రాఫిక్‌లోనే.. ఇక చదివేదెలా ?? ’ బెంగళూరు స్కూలు పిల్లల వీడియో వైరల్‌

21న వచ్చే సూర్య గ్రహణం వెరీ స్పెషల్‌.. ఎందుకంటే!

లంచం తీసుకుంటూ దొరికిపోయిన గ్రూప్ 1 ఎగ్జామ్ టాపర్

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌‌లో చంద్రబాబు మనవడు.. ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్‌గా నారా దేవాన్ష్‌

Weather Report: నైరుతి తిరోగమనం.. 3 రోజులు ముందుగానే