Gold Prices Fall: భారీగా తగ్గుతున్న బంగారం ధర.. ఎంత తగ్గిందంటే.!

|

Aug 09, 2024 | 4:57 PM

మహిళలకు శుభవార్త.. బంగారం ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. బంగారం, వెండి ధరల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. దేశీయ మార్కెట్ లో గోల్డ్, సిల్వర్ రేట్లు మరోసారి నేల చూపులు చూస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో తీవ్ర ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌ తర్వాత ఒక్కసారిగా పసిడి ధరలు దిగి వచ్చాయి. తాజాగా ఆగస్టు 7వ తేదీన 10 గ్రాముల బంగారంపై దాదాపు వెయ్యి రూపాయల వరకూ తగ్గింది. వెండి కూడా 3 వేల వరకూ తగ్గింది.

దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,040 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,850లు గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,890లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,700లుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 64,710 లు, 24 క్యారెట్ల బంగారం రూ. 70,590లుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,990లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.69,810 వద్ద కొనసాగుతోంది. కేరళ, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,890 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,700 రూపాయలు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,890 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,700 రూపాయలు పలుకుతోంది. ఇక వెండి కూడా బంగారం వెంటే నడుస్తోంది. కిలో వెండి రూ.82,400 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌, కేరళ, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.87,400లు పలుకుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Aug 09, 2024 04:57 PM