Gold Price: గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!

|

Apr 27, 2024 | 12:41 PM

బంగారం ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయి. తులం బంగారం రూ. 80 వేలకు చేరువకానుంది అన్న వార్తల నడుమ తాజాగా జరుగుతోన్న పరిణామాలు కాస్త ఊరటనిస్తున్నాయి. గడిచిన రెండు నెలలుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్‌ పడినట్లు కనపిస్తోంది. ముఖ్యంగా గడిచిన మూడు రోజులుగా బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. ఏప్రిల్‌ 23న ఒక్కే రోజే తులం బంగారంపై ఒకేసారి రూ. 1500 తగ్గి బంగారం కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్‌ ఇచ్చింది.

బంగారం ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయి. తులం బంగారం రూ. 80 వేలకు చేరువకానుంది అన్న వార్తల నడుమ తాజాగా జరుగుతోన్న పరిణామాలు కాస్త ఊరటనిస్తున్నాయి. గడిచిన రెండు నెలలుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్‌ పడినట్లు కనపిస్తోంది. ముఖ్యంగా గడిచిన మూడు రోజులుగా బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. ఏప్రిల్‌ 23న ఒక్కే రోజే తులం బంగారంపై ఒకేసారి రూ. 1500 తగ్గి బంగారం కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్‌ ఇచ్చింది. ఇక తాజాగా శుక్రవారం కూడా బంగారం ధరలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,390గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,410 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,240లు కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,260 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,090కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,190 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,240గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,260 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,240 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,260 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,240కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,260 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి ధరలో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. దేశవ్యాప్తంగా శుక్రవారం కిలోవెండిపై రూ. 100 తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్‌, జైపూర్ వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 82,400గా ఉంది. ఇక చెన్నై, హైదరాబాద్‌, కేరళ, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 85,900 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.