Today Gold Price: సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా..!

Updated on: Dec 01, 2025 | 9:25 PM

బంగారం, వెండి ధరలు డిసెంబర్ 1న భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.660 పెరిగి రూ.1,30,480 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,600కి చేరింది. కిలో వెండి ధర రూ.3000 పెరిగి రూ.1,88,000 పలుకుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోని తాజా ధరలను కొనుగోలుకు ముందు తనిఖీ చేయాలి.

బంగారం ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యులకు బంగారం కొనాలా వద్దా అనే సందిగ్ధత నెలకొంటోంది. తాజాగా డిసెంబరు 1 సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.660 పెరిగి, రూ.1,30,480 కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరిగి రూ.1,19,600 పలుకుతోంది. కిలో వెండి పై రూ.3000 పెరిగి రూ.1,88,000 పలుకుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,30,630 , పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,750 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,480 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,19,600 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,670, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,700 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,480లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,600 లు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,30,480 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,19,600 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.1,88,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు మధ్యాహ్నం 1 గంటకు నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్లెమింగో ఒంటి కాలి జపం కథేంటో తెలుసా..?

పొదుపుకు ఉత్తమ సూత్రం.. 50/30/20 రూల్

కప్పు కాఫీ రూ.570లు.. స్పెషలేంటో తెలిస్తే

చలిగా ఉందని కాఫీ, టీ తెగ తాగేస్తున్నారా.. డేంజర్‌

పాత “సిమ్ కార్డు” పడేస్తున్నారా? “డాట్” వార్నింగ్‌ ఏంటంటే!