Gold Price: బాబోయ్ బంగారం ధర మోత మోగిపోతోంది..
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రికార్డులతో హోరెత్తించాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఢిల్లీలో రూ.1,500 ఎగసి మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,19,500 పలికింది. కిలో వెండి విలువ కూడా ఆల్‌టైమ్ హైకి చేరింది. ఒక్కరోజే ఏకంగా రూ.7,000 పుంజుకొని తొలిసారి రూ.1,50,000గా నమోదైనట్టు అఖిల భారత బులియన్ అసోసియేషన్ తెలియజేసింది.
సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమ వర్గాల నుంచి కూడా డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమంటున్నారు విశ్లేషకులు. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,560గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,860గానూ ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,410లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,710లుగా ఉంది. చెన్నై, బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,740లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,010 లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,410లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,710లు పలుకుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం, వెండి పెట్టుబడిదారులకు లాభాల పంట పండించాయి. గత ఏడాది డిసెంబర్ 31 నాటి ధరలతో పోలిస్తే, 10 గ్రాముల బంగారంపై ఇప్పటివరకు రూ.40,550 లాభం రాగా, కిలో వెండిపై రూ.60,300 రాబడి వచ్చింది. ఇదే సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు ఎలాంటి లాభాలు ఇవ్వకపోవడంతో, పెట్టుబడిదారుల దృష్టి బులియన్ మార్కెట్‌పై కేంద్రీకృతమైంది. దేశీయ మార్కెట్‌లో ఈ పెరుగుదల అనూహ్యంగా ఉండటంతో పెట్టుబడిదారులు సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యంగా వెండి ధరలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు ఇదే జోరును కొనసాగిస్తున్నాయి. మల్టీ కమోడిటీస్ ఎక్స్ఛేంజ్‌లో అక్టోబర్, డిసెంబర్ కాంట్రాక్టులు భారీ లాభాలతో ట్రేడ్ అవుతూ కొత్త రికార్డులను నమోదు చేశాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.50 కోట్లు ఖర్చు చేసి ఈ పక్షి జాడ కనిపెట్టారు..!
గుడ్డిగా కెరీర్ ఎంపిక. అంకుల్ సలహానే వేదం 90% స్టూడెంట్స్ దుస్థితి ఇదీ
గుప్పెడంత స్థలంలో ఐదంతస్తుల కొంప.. గృహ ప్రవేశానికి ముందే కూల్చివేత
