సిగరెట్‌ రూ.18 కాదు.. ఇక రూ.72

Updated on: Jan 03, 2026 | 10:23 AM

ఫిబ్రవరి 1 నుండి సిగరెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. కొత్త సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025 ప్రకారం, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై పన్నులు నాలుగు రెట్లు అధికమవుతాయి. ప్రస్తుతం రూ.18 ఉన్న సిగరెట్ ధర రూ.72కి చేరవచ్చు. పొగాకు వినియోగాన్ని తగ్గించడం, ముఖ్యంగా యువతను ధూమపానం నుండి దూరం చేయడం ప్రభుత్వ లక్ష్యం. ఈ పెంపుపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

సిగరెట్లపై టాక్స్‌లు భారీగా పెరగనున్నాయి. కొత్త చట్టం కారణంగా ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ల ధరలు నాలుగు రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025 ధూమపానం చేసేవారి జేబుకు చిల్లు పెట్టనుంది. ఈ చట్టం ద్వారా సిగరెట్లు , పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. దేశంలో పొగాకు వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం 1000 సిగరెట్ స్టిక్స్‌పై రూ.200 నుంచి రూ.735 వరకు ట్యాక్స్ ఉంది. ఈ కొత్త సవరణ చట్టం ద్వారా దాన్ని రూ.2,700 నుంచి రూ.11 వేల వరకు పెంచారు. సిగరెట్ రకం, దాని పొడవు ఆధారంగా ఈ ట్యాక్స్ విధించారు. ఈ ట్యాక్స్ పెంపు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తే.. ప్రస్తుతం మార్కెట్‌లో సుమారు రూ.18 పలుకుతున్న ఒక సిగరెట్ ధర ఏకంగా రూ.72 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ సిగరెట్ల ధరల పెంపు వార్తపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ కాలుష్యాన్ని ఉద్దేశించి ఒక నెటిజన్ స్పందిస్తూ.. “నాకేం పర్వాలేదు, నేను ఇప్పటికే ఢిల్లీ గాలిని ఉచితంగా పీలుస్తున్నాను” అంటూ సెటైరికల్‌గా కామెంట్ చేశారు. కొంతమంది ధూమపాన ప్రియులే ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ధరలు పెరగడం వల్ల కనీసం విద్యార్థులు, యువత సిగరెట్లకు దూరంగా ఉంటారని ఒక రెడ్డిట్ యూజర్ రాసుకొచ్చారు. ధరలు పెంచినంత మాత్రాన ఇప్పటికే సిగరెట్ల బారిన పడి.. దాన్ని వ్యసనంగా మార్చుకున్న వారు ధూమపానం మానేస్తారా లేక దీనివల్ల అక్రమ రవాణా పెరుగుతుందా అనే సందేహాలు కూడా నెటిజన్ల నుంచి వస్తున్నాయి. ఈ కొత్త చట్టం ద్వారా యువతను ధూమపానానికి దూరంగా ఉంచుతుందని కొంతమంది హర్షిస్తుండగా.. మరికొందరు మాత్రం దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తప్పతాగి రెచ్చిపోయిన ఎస్‌ఐ.. ఏం చేశాడంటే

న్యూ ఇయర్ వేళ మహేష్‌ ఫ్యామిలీ ఫొటోలు పంచుకున్న నమ్రతా

భారీ ప్యాకేజీతో సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ విద్యార్థి

కనువిందు చేస్తున్న హిమపాతం.. పోటెత్తిన పర్యాటకులు

BSNL: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త..