AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రెడిట్ కార్డ్ తో బంగారం కొనవచ్చా? RBI ఏం చెబుతోంది?

క్రెడిట్ కార్డ్ తో బంగారం కొనవచ్చా? RBI ఏం చెబుతోంది?

Samatha J

|

Updated on: May 03, 2025 | 3:57 PM

ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యులు సైతం బంగారం కొనలేని పరిస్థితి ఉంది. అయితే క్రెడిట్‌ కార్డు అనేది చాలా మంది వద్ద ఉంటుంది. క్రెడట్‌ కార్డును ఉపయోగించి బంగారాన్ని కొనవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏం చెబుతోంది? ఎలాంటి నిబంధనలు ఉన్నాయో చూద్దాం. భారతదేశంలో బంగారాన్ని మంచి పెట్టుబడిగా భావిస్తారు. మహిళలు బంగారు ఆభరణాలు ధరించడం నుండి శుభకార్యాలకు కొత్త నగ చేయించుకోవడం వరకు అనేక చోట్ల బంగారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం వినియోగించే దేశం భారతదేశం. అయితే, ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగం పెరిగింది. ఈ కారణంగా గత కొన్ని రోజులుగా బంగారం ధర బాగా పెరుగుతోంది.ముఖ్యంగా ఇటీవల బంగారం ధరలు వేగంగా పెరిగాయి. దీనివల్ల సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బుతో బంగారాన్ని కొని పొదుపు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో క్రెడిట్ కార్డు ఉపయోగించి బంగారం కొనడం సాధ్యమేనా? 2013లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులను ఉపయోగించి బంగారం కొనుగోలు చేయడంపై కొన్ని పరిమితులు విధించింది. దీని ప్రకారం.. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే బంగారు ఆభరణాల కొనుగోళ్లను నెలవారీ వాయిదాలుగా మార్చరాదని ఆదేశించింది.