Budget 2025: బడ్జెట్ నుంచి మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటోంది ??

Updated on: Jan 28, 2025 | 4:28 PM

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతోంది అనగానే..దేశంలోని అన్ని వర్గాల వాళ్లూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తమకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకుంటారు. ఈ విషయంలో మిడిల్ క్లాస్ వాళ్లు ఇంకాస్త ఎక్కువ ఆశతో ఉంటారు. నిత్యావసర సరుకుల ధరల నుంచి పెట్రోల్, డీజిల్ రేట్ల వరకూ ఏమైనా కాస్త ఊరట ఉంటుందేమోనని నిరీక్షిస్తారు.

ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. డాలర్ విలువ రోజురోజుకీ బలపడుతూ రూపాయి విలువ తగ్గిపోతోంది. ఈ కారణంగానే సరుకుల ధరలు పెరుగుతూ పోతున్నాయి. నిత్యావసరాల ధరలు పెరిగాయంటే కచ్చితంగా..అది మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద దెబ్బే. నెలనెలా సామాన్లకు ఇంత అని పక్కాగా లెక్కగట్టి మరీ పక్కన పెట్టుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్లు. ఆ బడ్జెట్‌లో కొంచెం అటూ ఇటూ తేడా వస్తే చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది..ఇలా నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల వచ్చే ఆదాయానికి, పెట్టే ఖర్చుకు పొంతన కుదరడం లేదు. ఈ లోటును భర్తీ చేయడానికి ఇప్పటికే చాలా అవస్థలు పడుతున్నారు. అందుకే..ఈ సారి బడ్జెట్‌లో ఈ సమస్య తీర్చే పరిష్కారమేమైనా ఉంటుందా అని గంపెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ద్రవ్యోల్బణం తగ్గాలంటే ఆ మేరకు కేంద్రం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కొనుగోలు శక్తి పెంచేలా నిర్ణయాలు తీసుకోవాలి. మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..ఈ పద్దులో ఇందుకు సంబంధించి ఏమైనా పరిష్కారం చూపించారా అన్నదే ఉత్కంఠ రేపుతున్న విషయం. ఫుడ్ ఐటమ్స్‌తో పాటు హెల్త్‌ కేర్, ఎలక్ట్రిసిటీ, పెట్రో ధరలు, హౌజింగ్..ఇలా అన్ని సెక్టార్‌లలోనూ మధ్యతరగతి వాళ్లకు ఎన్నో అంచనాలున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Saif Ali Khan: సైఫ్‌ పై దాడి సమయంలో కరీనా కపూర్ పార్టీలో ఉన్నారా ?? మనుషుల తీరుపై హీరోయిన్ సీరియస్

వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ గుట్టురట్టు

బాబాయ్‌కి పద్మభూషణ్‌పై అబ్బాయిల రియాక్షన్‌

అసలేంటీ డ్రోన్ సిటీ ?? సీఎం చంద్రబాబు లక్ష్యం ఇదేనా

7 నెలల కిందట పెళ్లి.. భార్య గర్భవతి.. ఇంతలోనే సూసైడ్ లెటర్.. అసలేమైంది ??