Credit Card Scam: క్రెడిట్ కార్డులో ఈ కొత్త రకం మోసం గురించి మీకు తెలుసా? తస్మాత్‌ జాగ్రత్త

|

Apr 30, 2024 | 12:04 PM

మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంటే ఈ సమాచారం మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మోసం జరిగింది గౌరవ్ ఒక్కడికే కాదు. యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన చాలా మంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఇలా మోసపోయారు. ఈ మోసంపై పలువురు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి లావాదేవీలు చేయనప్పటికీ ఇలాంటి ఓటీపీలు చాలా వస్తున్నాయని.. చాలా మంది

మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కూడా ఉంటే ఈ సమాచారం మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మోసం జరిగింది గౌరవ్ ఒక్కడికే కాదు. యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన చాలా మంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఇలా మోసపోయారు. ఈ మోసంపై పలువురు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి లావాదేవీలు చేయనప్పటికీ ఇలాంటి ఓటీపీలు చాలా వస్తున్నాయని.. చాలా మంది కస్టమర్లకు ఇలాంటి ఘటన జరిగిందని.. తమ కార్డుల నుంచి అనధికార అంతర్జాతీయ లావాదేవీలు జరిగాయని క్రెడిట్ కార్డ్ యూజర్లు చెబుతున్నారు. మేం బ్యాంకులు, క్రెడిట్ కార్డులను సురక్షితంగా భావిస్తాం, వాటిని నమ్ముతాం.. అయినా ఈ మోసం ఎలా జరుగుతోంది? ఇది ఒక బ్యాంక్ కార్డ్‌తో జరిగితే, ఇతర బ్యాంక్ కార్డ్‌లతో కూడా ఇలాగే జరగవచ్చు.

యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ కార్డ్‌లపై అంతర్జాతీయ లావాదేవీలను ఆమోదించిన వారికి ఇలాంటి అనేక మెసేజ్ లు వస్తున్నాయి. వారి కార్డ్‌లలో అలాంటి లావాదేవీలు జరిగాయని వారికి తెలుస్తోంది. ఓటీపీ మెసేజ్‌లు కూడా వస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ డేటాను దొంగిలించారని, ఎవరో హ్యాక్ చేశారని.. ఖాతాదారులు బ్యాంకుకు ఫిర్యాదు చేశారు దీనిపై బ్యాంకు సలహా ఇచ్చింది. అయితే క్రెడిట్ కార్డులో ఈ కొత్త మోసం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.