Bank Holidays in October: ఖాతాదారులకు అలర్ట్‌.. అక్టోబరులో బ్యాంకులు 21 రోజులు బంద్‌..!(వీడియో)

|

Oct 06, 2021 | 9:31 PM

బ్యాకు ఖాతాదారులకు ఒక ఇంపార్టెంట్‌ న్యూస్‌. మీరు తరచూ బ్యాంకు లావాదేవీలు జరిపేందుకు బ్యాంకుకు వెళ్తుంటారా.. అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవడం మంచిది.

బ్యాకు ఖాతాదారులకు ఒక ఇంపార్టెంట్‌ న్యూస్‌. మీరు తరచూ బ్యాంకు లావాదేవీలు జరిపేందుకు బ్యాంకుకు వెళ్తుంటారా.. అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవడం మంచిది. ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మీరు ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవచ్చు. దేశవ్యాప్తంగా అక్టోబరు నెలలో బ్యాంకులకు 21 రోజులపాటు సెలవులు ఉన్నాయి. అయితే రాష్ట్రాల ప్రాతిపదికన ఈ సెలవులు మారతాయి. 21 రోజులలో 14 మాత్రమే బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు జారీ చేసింది. మిగిలిన 7 రోజులు వారాంతపు సెలవులు, ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు ఉన్నాయి. ఇక సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందాం.

ఈ సెలవుల జాబితా చూస్తే అక్టోబర్‌లో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు 10 రోజులు సెలవులు వచ్చాయి. అందులో ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం సాధారణంగా ఉండే సెలవులే. అక్టోబర్‌లో 5 ఆదివారాలు వచ్చాయి. ఈ సెలవులతో పాటు గాంధీ జయంతి, దసరా, ఈద్ -ఎ-మిలాద్ సందర్భంగా బ్యాంకులకు మూడు సెలవులు వచ్చాయి. ఇవన్నీ కలిపి తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులు బ్యాంకులు మూసే ఉంటాయి. అందుకే ఖాతాదారులు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
మరిన్ని చదవండి ఇక్కడ : Smartphone Screen Glass: గుడ్‌న్యూస్‌..ఇక మొబైల్‌ స్క్రీన్‌ గ్లాస్‌ అస్సలు పగలదు..! ఈ వీడియో చుస్తే మీరు కూడా నమ్ముతారు..

 Viral Video: ఏడాదిలో 7 కోట్లు సంపాదించింది.. ఎలాగో తెలిస్తే షాక్‌ అవుతారు..!(వీడియో వైరల్)

 Bitcoin With Volcanic Energy: అగ్ని పర్వతాలనుంచి బిట్‌ కాయిన్స్‌..! చిన్న దేశమైనా గొప్ప నైపుణ్యం.. వైరల్ అవుతున్న వీడియో

 Earth: మసకబారిపోతున్న భూమి..! కాలుష్యం కారణంగా భూమిపై మొదలైన పరిణామం..(వీడియో)