ఇవి పిచ్చి ఆకులు కాదండి బాబు.. విషయం తెలిస్తే షాకవుతారు
రోజువారీ వంటకాల్లో కొత్త రుచి కావాలా? అదనపు మసాలాలు లేకుండా ఆహార రుచిని రెట్టింపు చేయడానికి ఆల్ స్పైసెస్ ఆకులు అద్భుత పరిష్కారం. ఈ ప్రత్యేక ఆకులలో లవంగం, యాలకులు, దాల్చిన చెక్క వంటి రుచులు కలిసి ఉంటాయి. కేవలం కొన్ని ఆకులు చేర్చడం ద్వారా మీ వంటలకు సరికొత్త రుచి, సువాసనను పొందవచ్చు. ఇంట్లోనే ఈ మొక్కను పెంచుకోవడం కూడా సులభం.
ఇంట్లో రోజూ వండే కూరలు.. ఎప్పుడూ ఒకేలా ఉండి బోరు కొడుతున్నాయా? రుచిలో కొత్తదనం కావాలా? ఎలాంటి మసాలాలు అవసరం కుండా కూరల్లో కొత్త రుచిని తీసుకొచ్చేందుకు ఈ ఆకులు ఉంటే చాలు.. మీ కూర టేస్ట్ అదిరిపోద్ది అంతే. అవే ఆల్ స్పైసెస్ ఆకులు . సాధారణంగా కూరలు వండేటప్పుడు పుదీనా, కరివేపాకు, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు లాంటి అనేక సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తాం. అయినప్పటికీ కొన్నిసార్లు కూర రుచి ఆశించిన స్థాయిలో ఉండదు. అలాంటప్పుడు వంటకు ఒక ప్రత్యేకమైన రుచిని అందించడానికి ఈ ఆల్ స్పైసెస్ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. కేవలం రెండు ఆకులు వేస్తే చాలు, టేస్ట్ అదుర్స్ అంటారు. ఈ ఆల్ స్పైసెస్ చెట్టు ఆకుల్లో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఒక్కో ఆకులో లవంగం, యాలకులు, బే ఆకు, దాల్చిన చెక్క లాంటి అనేక సుగంధ ద్రవ్యాలు కలిసి ఉంటాయి. అవి ప్రత్యేక రుచిని అందిస్తాయి. కూరలు, పప్పులు, కాయధాన్యాలు మరే ఇతర వంటకమైనా, ఈ ఆకులు వేస్తే..వాటి రుచి రెట్టింపు అవుతుంది. వంట చేసేటప్పుడు బే ఆకుల స్థానంలో రెండు నుంచి నాలుగు ఆల్ స్పైసెస్ ఆకులు వేస్తే సరిపోతుంది. దీని వల్ల అదనంగా ఎక్కువ మసాలాలు వేయాల్సిన అవసరమే ఉండదు. ఈ ఆకులు వంటకు ప్రత్యేకమైన సువాసనను అందించి, రుచిని మరింతగా పెంచుతాయి. ఈ ఆల్ స్పైసెస్ ట్రీని ఇంట్లోనే చాలా సులభంగా పెంచుకోవచ్చు. ఏదైనా నర్సరీలో ఈ మొక్క లభిస్తుంది. ఇంటి ముందు పెంచుకునే తోటలో లేదా బాల్కనీలో కూడా కుండీల్లో ఈ మొక్కలను పెంచుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
ప్రపంచంలోనే తొలి క్లోన్ వరి వంగడం
కుమారుడికి మాటిచ్చా.. రూ. 27 వేల కోట్ల సంపద దానం
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం రైల్వేస్టేషన్లు,బస్‌స్టేషన్లు రద్దీ