Vijayawada: భద్రతలేని పడవ ప్రయాణం.! ఇంద్రకీలాద్రి కృష్ణానదిలో బోటు షికారు..
కార్తీకమాసం.. వీకెండ్.. వరుస సెలవులు.. దీంతో విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. కాగా బోటు షికారు అంటే చాలామంది ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో దూరప్రాంతాలనుంచి వచ్చినవారు దైవ దర్శనం అయిపోగానే సరదాగా కృష్ణానదిలో బోటు షికారు చేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఈ బోటు షికారు భద్రత ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.
కార్తీకమాసం.. వీకెండ్.. వరుస సెలవులు.. దీంతో విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. కాగా బోటు షికారు అంటే చాలామంది ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో దూరప్రాంతాలనుంచి వచ్చినవారు దైవ దర్శనం అయిపోగానే సరదాగా కృష్ణానదిలో బోటు షికారు చేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఈ బోటు షికారు భద్రత ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. గతంలో ఎన్నో బోటు ప్రమాదాలు జరిగి, ఎందరో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. అయినా బోటు నిర్వాహకులు మాత్రం పర్యాటకుల భద్రతను గాలికొదిలేస్తున్నారు. ప్రమాదకర స్థితిలో యాత్రికులను బోటు షికారుకు తీసుకెళ్తున్నారు. కృష్ణానదిలోని భవాని ఐల్యాండ్ అధికారులు ఎలాంటి భద్రత చర్యలు తీసుకోకుండా, కనీసం లైఫ్ జాకెట్లు కూడా లేకుండా యాత్రికులను బోటు షికారు చేయిస్తున్నారు. పర్యాటకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఒక్కో పడవలో సుమారు 20 నుంచి 30 మంది యాత్రికులు ప్రయాణిస్తున్నారు. ఏ ఒక్కరికి లైఫ్ జాకెట్ సరఫరా చేయలేదు. ప్రయాణికుల వద్ద అధికమొత్తంలో డబ్బులు వసూలు చేసినా.. వారి భద్రతకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. కుటుంబాలతో సరదాగా గడపాలని వచ్చే పర్యాటకుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.