Adani Group: అదానీ గ్రూపునకు చెందిన గోదాంలో భారీ అగ్నిప్రమాదం.! ఒక్కసారిగా చెలరేగిన మంటలు.
ఉత్తరప్రదేశ్ లో అదానీ గ్రూపునకు చెందిన ఓ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సహరన్ పూర్ లోని ఈ గోదాంలో ఫార్చూన్, ఇతర బ్రాండ్ల వంట నూనె, నెయ్యి డబ్బాలు, పంచదార, పిండి, ఇతర నిత్యావసర సరుకులు భారీ స్థాయిలో నిల్వ ఉంచుతారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తారు. అగ్నిప్రమాదం కారణంగా నెయ్యి, నూనె డబ్బాలు పెద్ద శబ్దంతో విస్ఫోటనం చెందడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఉత్తరప్రదేశ్ లో అదానీ గ్రూపునకు చెందిన ఓ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సహరన్ పూర్ లోని ఈ గోదాంలో ఫార్చూన్, ఇతర బ్రాండ్ల వంట నూనె, నెయ్యి డబ్బాలు, పంచదార, పిండి, ఇతర నిత్యావసర సరుకులు భారీ స్థాయిలో నిల్వ ఉంచుతారు. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తారు. అగ్నిప్రమాదం కారణంగా నెయ్యి, నూనె డబ్బాలు పెద్ద శబ్దంతో విస్ఫోటనం చెందడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గత అర్ధరాత్రి నుంచి మొదలైన మంటలు క్రమంగా గోదాం మొత్తానికి వ్యాపించాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ 12 ఫైరింజన్లను రంగంలోకి దింపింది. పొరుగు జిల్లాల నుంచి కూడా ఫైరింజన్లను, అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. మంటల కారణంగా తీవ్రస్థాయిలో పొగ రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ గోదాంలో తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

