పవర్ ప్రొడక్షన్ అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే జేబులో నుంచి తీసి ఇచ్చేది కాదని భట్టి విక్రమార్క అన్నారు. దీనికంటే ముందు సరైన ప్లానింగ్ చేసి పవర్ ప్రాజెక్టు నిర్మించడం అందులో ప్రొడక్షన్ తీసుకురావడానికి ఐదారేళ్లు పడుతుందన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చే కంటే ముందు కాంగ్రెస్ పవర్ ప్రాజెక్టులను నిర్మించిందని వివరించారు. వాటి నుంచి ప్రొడక్షన్ వచ్చే సరికి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని.. అందుకే కరెంట్ ఇవ్వగలుగుతోందని స్పష్టం చేశారు.
ఇక కర్ణాటక విషయానికొస్తే గతంలో పరిపాలించిన బీజేపీకి ముందుచూపు లేని కారణంగా పవర్ ప్రాజెక్టులను నిర్మించలేకపోయాయి. అందుకే ఇప్పుడు కరెంట్ ఇవ్వడం కష్టమవుతోందన్నారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ అద్భుతంగా పనిచేస్తోందని చెప్పారు. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ముందు నుంచి ఉండి ఉంటే మిగులు కరెంట్ ఉండేలా పవర్ ప్రాజెక్టులు కట్టేవాళ్లమని తెలిపారు.
భట్టి విక్రమార్క పూర్తి వీడియో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..