Hyderabad: నాలాలో బెంజ్ కారు.. కారులో నిండు గర్బిణి.. వీడియో వైరల్.
హైదరాబాద్‌లో చినుకు పడగానే వరద పోటెత్తుతుంది. ఒకప్పుడు నగరంలో కుంభవర్షం కురిసినా రోడ్డుపై నీటి చుక్క కనిపించేది కాదు. రాను రాను నగరంలో జనాభా పెరగడం, నేల ఏమాత్రం కనిపించకుండా అంతా కాంక్రీట్ మయం చేయడం, కుంటలు మాయమవడం, కాలువలు, నాళాలకు అడ్డంగా
హైదరాబాద్‌లో చినుకు పడగానే వరద పోటెత్తుతుంది. ఒకప్పుడు నగరంలో కుంభవర్షం కురిసినా రోడ్డుపై నీటి చుక్క కనిపించేది కాదు. రాను రాను నగరంలో జనాభా పెరగడం, నేల ఏమాత్రం కనిపించకుండా అంతా కాంక్రీట్ మయం చేయడం, కుంటలు మాయమవడం, కాలువలు, నాళాలకు అడ్డంగా గోడలు గట్టడం, రోడ్డు నిర్మాణం, అక్రమ కట్టడాలు ఇలా కారణమేదైనా ప్రజలే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో ఎక్కడ పూడికలతో నాళాలు మూసుకుపోయి కాలువల్లో ప్రవహించాల్సిన వర్షపు నీరు రోడ్లపై పోటెత్తుతోంది. దాంతో చినుకు పడితేచాలు వాహనదారుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంటుదో.. ఎక్కడ ఏ గుంటలో కారు, బైక్ ఇరుక్కుపోతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ వాహనదారుడికి. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి రోడ్డు జలమయమైపోయింది. అదే సమయంలో ఓ బిఎండబ్ల్యు కారులో దంపతులు వెళ్తున్నారు. వర్షం కారణంగా రోడ్డుమీద నీళ్లు కారులోపలికి చొచ్చుకొని వచ్చి కారు ఆగిపోయింది. అలా దాదాపు 12 బిఎండబ్ల్యు కార్లు, 8 బెంచ్‌కార్లు వర్షపు నీటిలో ఆగిపోయాయి. 10 గంటలపాటు వారంతా వర్షపు నీటిలోనే ఉండిపోయారు. వారిలో ఓ మహిళ గర్భిణి కాగా ఆమె భర్త ఓ చార్టెడ్ ఎకౌంటెంట్. ఆ ప్రాంతంలోని నాళాకు ఎలాంటి వాల్ నిర్మాణంలేకపోవడంతో నీరు నాళాలోకి వెళ్లే మార్గంలేక రోడ్డుమీదే నిలిచిపోయింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమకు కలిగిన ఈ చేదు అనుభవాన్ని చార్టెడ్ ఎకౌంటెంట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాళావ్యవస్థను బాగుచేయించాలని కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...