Loading video

నిద్రలేమితో బాధపడతున్నారా.. ఇదిగో పరిష్కారం..!

|

Mar 14, 2025 | 5:33 PM

కాలంతో పాటు మనుషుల జీవన విధానం మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో తినేందుకు కూడా టైం లేని పరిస్థితి. ఇక వర్క్ టెన్షన్లతో చాలా మంది నిద్రపట్టక పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అలా నిద్ర లేమి సమస్యతో బాధపడేవారికి యాలకులు చాలా మంచి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. ఇవి నాడీ వ్యవస్థపై అద్భుతంగా పనిచేసి ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్ర పోయేందుకు సహాయపడతాయి. యాలకులు తినడం వల్ల కర్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది సుఖమైన నిద్రకు దోహదపడుతుంది. రాత్రిపూట ఒకటి రెండు యాలకులు నమలడం వల్ల మంచి నిద్ర వస్తుందంటున్నారు. నిద్రలేమికి మాత్రమే కాదు.. యాలకులు వల్ల ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాంటున్నారు నిపుణులు. యాలకులు లివర్, మూత్రపిండాల పనితీరు మెరుగుపరుస్తాయట. ఇవి శరీరంలో విషాలను బయటకు పంపించడానికి సహకరిస్తాయి. శరీరంలో చెడు టాక్సిన్లను తొలగించడం ద్వారా శరీరాన్ని శుభ్రపరుస్తాయి. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు యాలకులు వాడటం వల్ల ఉపశమనం పొందొచ్చు. దగ్గు, ఉబ్బసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతో సహాయపడతాయట. యాలకులు శ్లేష్మాన్ని తొలగించి ఊపిరితిత్తులలో వాపును తగ్గించి గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలోనూ యాలకులు కీలకపాత్ర పోషిస్తాయట.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి వేదికపైనే రెచ్చిపోయిన వధూవరులు.. వీడియో చూస్తే

చావా సినిమా ఎఫెక్ట్‌ బంగారం కోసం ఆ కోట చుట్టూ తవ్వకాలు

తెల్లారితే పెళ్లి..! అంతలోనే.. పెళ్లి కుమారుడి ఆత్మహత్య

హీరోయిన్ అంజలితో ఎఫైర్..? ఎమోషనల్ అయిన కోన

Dragon: రావణ రాజ్యంలో.. రాక్షసుడి వేట..