ఒక్క గంటలో శ్రీవారి దర్శనం.. ఏఐ టెక్నాలజీతో ఎంతవరకు సాధ్యం ??

|

Dec 26, 2024 | 1:40 PM

తిరుమల వెంకన్న దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహకారంతో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలన్న ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో ఎక్స్ పర్ట్స్ అయిన విదేశీ ప్రతినిధులతో టీటీడీ సంప్రదింపులు జరుపుతోంది. ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్ట బోతోంది.

ఏడుకొండలవాడి దర్శనం కోసం కొండెక్కి తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీవారి దర్శనం మరింత సులభంగా జరిగేలా టిటిడి ప్రయత్నిస్తోంది. గంటల తరబడి క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండకుండా శీఘ్ర దర్శనం కల్పించే ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు టీటీడీ పాలకమండలి అడుగులు వేస్తోంది. తొలి సమావేశంలోనే బిఆర్ నాయుడు చైర్మన్ గా టీటీడీ ధర్మకర్తల మండలి ప్రయత్నాలు ప్రారంభించింది. సగటున రోజూ దాదాపు 70 వేల మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకుంటుండగా వెంకన్న దర్శనం కోసం తిరుమల కొండపై భక్తులు ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి భక్తులు.. స్వామివారి దర్శనానికి ముందు ఎన్ని కష్టాలు పడ్డా.. దర్శనభాగ్యంతో వాటిని మర్చిపోతున్నారు. ఆపద మొక్కులవాడి దర్శనానికి వస్తున్న భక్తులు ఏ ఇబ్బందీ లేకుండానే శ్రీవారిని సులభతరంగా దర్శించుకునేలా ప్రయత్నం చేస్తున్న టీటీడీ ఈ మేరకు కార్యచరణ చర్చలు జరుపుతోంది. సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తొలి పాలక మండలి సమావేశంలోనే స్పష్టం చేసారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. ఈ మేరకు విదేశీ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవర పొట్టేలుకు బాబోయ్ ఇంత రేటా

క్లాసులో ఉండగానే టీచర్ కిడ్నాప్.. సీన్ కట్ చేస్తే..

బిర్యానీ కోసం రెస్టారెంట్‌కు వెళ్లిన ఫ్రెండ్స్‌.. బిర్యానీ తింటుండగా..

Pushpa 2: రప్ప.. రప్ప.. ఆగని పుష్ప 2 రికార్డుల దండయాత్ర

ఆహా.. ఈ ఉద్యోగుల లక్కే.. లక్కు