పంటపొలాల్లో చేపల సందడి.. సంచులతో ఎగబడ్డ జనం

Updated on: Oct 28, 2025 | 6:12 PM

మొంథా తుపాను ఏపీని భయపెడుతోంది. దీంతో ప్రజలను ఎలా రక్షించాలా అని అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. జనాలు మాత్రం చేపలకోసం ఎగబడ్డారు. ఇదేంటి చేపలకోసం ఎగబడటం అనుకుంటున్నారా.. ఫ్రీగా వస్తే ఫినాయిలు కూడా వదలని జనాలు పెద్ద పెద్ద చేపలు చేలల్లో చెంగు చెంగున ఎగురుతూ రా రమ్మంటుంటే వదులుతారా? తుపాను కాదుకదా..సునామీ వచ్చినా ఆగేదే లేదు అన్నట్టు చేపలకోసం ఎగబడ్డారు ఒంగోలులో జనాలు.

ఏపీలో తుపాను ప్రభావంతో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. చెరువులు, కుంటలకు భారీగా వరదనీరు చేరుతోంది. ఈ క్రమంలో ఒంగోలు సమీపంలోని పెళ్ళారు చెరువుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. చెరువు నిండి గ్రామంవైపు గండి పడితే ఊరు మునిగి పోయే ప్రమాదం ఉందని స్థానికులు పంటపొలాల్లోకి గండి కొట్టారు. దీంతో చెరువులో నీటితోపాటు అందులో పెంచుతున్న చేపలు కూడా గండి కాలువనుంచి పొలాల్లోకి వచ్చేసాయి. అప్పటివరకూ చెరువులో ఉత్సాహంగా ఈదిన చేపలు పొలాల్లో ఈదడానికి ఇబ్బందులు పడుతూ చెంగు చెంగున ఎగురుతున్నాయి. ఈ దృశ్యం అటుగా వెళ్తున్న వారు గమనించి వెంటనే పొలాల్లోకి దిగారు. పొలాల్లోకి చేపలు కొట్టుకొచ్చిన విషయం దావానంలా వ్యాపించింది. వెంటనే స్థానికులు వలలు, ప్లాస్టిక్‌ బస్తాలు తీసుకుని పొలాల్లోకి ఎగబడ్డారు. ఎగిరెగిరి పడుతున్న చేపలను అందినకాడికి ఒడిసి పట్టుకుని గోతాల్లో నింపుకున్నారు. చేపలను చూడగానే తుపానను మాట మర్చిపోయి వేడి వేడిగా చేపల పులుసు చేసుకుని తినొచ్చంటూ సంబరపడుతూ సంచులనిండా చేపలు పట్టుకొని ఇంటి బాట పట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చింపాంజీ గెటప్‌లో మున్సిపల్ సిబ్బంది.. జనగామలో వింత ప్రయోగం

Gold Price Today: మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా

తాత ముత్తాతల మూలాలేవి? 150 ఏళ్ల తర్వాత భారత్‌కు ఐదో తరం వ్యక్తి !! అచ్ఛం 7 తరాలు కథ లాంటి స్టోరీ

మయన్మార్‌లో సైబర్ మాఫియా దారుణాలు.. బయటపడ్డ 400 మంది భారతీయ బాధితులు

చైనా సముద్రంలో కూలిన అమెరికా విమానం