Andhra Pradesh: పందెం రాయుళ్లకు షాక్ !! కలెక్టర్లు,ఎస్పీలకు హైకోర్టు ఆదేశాలు

Updated on: Jan 12, 2026 | 3:40 PM

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంక్రాంతి కోడి పందేలు, పేకాట వంటి జూదాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. జంతుహింస నిరోధక చట్టం, ఏపీ జూద చట్టాలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. చట్ట ఉల్లంఘనలపై బాధ్యత వహించాలని హెచ్చరించింది. గ్రామాల్లో అవగాహన కల్పించాలని, అక్రమ కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించింది.

ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ మూడు రోజులు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో అనేక రకాల పోటీలను నిర్వహించటం సంప్రదాయం. ఇందులో ముఖ్యమైనవి కోడి పందేలు, ఎడ్లపందాలు, పొట్టేలు పందాలు, పేకాట వంటి అనేకం ఉన్నాయి. ఈ పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. ఈ కోడిపందేలను చూసేందుకు రాష్ట్రానికి చెందిన వారే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. దీంతో కోడి పందాలు,పేకాటపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోడిపందేలను అడ్డుకోవాలని జిల్లాల కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. జంతుహింస నిరోధకచట్టం, ఏపీ జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని, గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. గ్రామాల్లో సభలు నిర్వహించి చట్టనిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. అవసరమైతే 144 సెక్షన్‌ విధించాలని హైకోర్టు పేర్కొంది. ఏపీ జూద నిరోధక చట్టం-1974ను కఠినంగా అమలు చేయాలని తేల్చిచెప్పింది. చట్టాల్ని సక్రమంగా అమలు చేయకపోతే కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హెచ్చరించింది. ఆయా జిల్లాల్లోని అన్ని మండలాల్లో ప్రత్యేకంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, దీనికోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు సంక్రాంతి సందర్భంగా కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందేలతో జీవహింసకు పాల్పడుతున్నారని, అక్రమ మద్యం, జూదం, పందేలను అడ్డుకోవాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిలువరించాలని కోరుతూ హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి, గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను పునరుద్ఘాటిస్తూ వాటిని అమలుచేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఈ సంక్రాంతికి కోడి పందేల బరులు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కోడిపందేలకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాలో వందల సంఖ్యలో బరులు సిద్ధమయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: మండిపోతున్న బంగారం.. రూ.3 లక్షలకు చేరువలో వెండి

Maruthi: అలా అనకండి డార్లింగ్స్‌..మరో సారి చూడండి.. నచ్చుతుంది

తమిళ పొంగల్‌కు ఏం జరుగుతుంది.. అన్నీ అనుమానాస్పదమే

నెక్స్ట్ రూ. 1000 కోట్లు ఎవరిది..? రేసులో ఉన్నదెవరు..?

బాలీవుడ్‌లో న్యూ గ్లామర్.. క్యూ కడుతున్న కొత్త హీరోయిన్లు

Published on: Jan 12, 2026 03:39 PM