ప్రైవేట్‌ ట్రావెల్స్‌కి ఏపీ ప్రభుత్వం సీరియస్‌ వార్నింగ్‌

Updated on: Jan 11, 2026 | 9:55 AM

సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌కి ఏపీ ప్రభుత్వం సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. రద్దీని ఆసరాగా చేసుకుని ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో వివిధ ప్రాంతాల్లోని ప్రజలంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. ప్రత్యేకించి.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది.

సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌కి ఏపీ ప్రభుత్వం సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. రద్దీని ఆసరాగా చేసుకుని ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో వివిధ ప్రాంతాల్లోని ప్రజలంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. ప్రత్యేకించి.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు తప్పవని ఏపీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మనీశ్‌కుమార్ హెచ్చరించారు. ప్రయాణికులపై భారం మోపేలా ఎవరైనా అధిక ఛార్జీలు వసూలు చేస్తే సంబంధిత బస్సులను సీజ్ చేస్తామని తెలిపారు. ప్రైవేట్ బస్సుల ట్రావెల్ యాజమాన్యాలు అధిక ధరలకు టికెట్స్ అమ్మితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీకి తిరిగే బస్సులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు కమిషనర్ మనీశ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ప్రైవేట్ బస్సు యజమానులతో సమావేశం నిర్వహించామని, టికెట్ రేట్లు పెంచొద్దని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. RTC నిర్దేశించిన ధరల కంటే 50శాతం మాత్రమే గరిష్ట ధరగా నిర్ణయించామన్నారు. అంతకంటే ఎక్కువ ధరలకు టికెట్స్ అమ్మే ప్రైవేట్ బస్సు యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. RTGS ద్వారా అభిబస్, రెడ్ బస్ యాప్స్‌లో బస్ ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. అధిక ధరలు వసూలు చేసే బస్ యజమానులపై కేసులు పెడతామన్నారు. ఈ నెల 18 వరకు అన్ని జిల్లాలో ప్రైవేట్ బస్సులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చేస్తామని.. అధిక ఛార్జీలు వసూలు చేయొద్దని.. టికెట్ రెట్లు పెంచొద్దని కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా యజమానులకు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే

రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్

గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?

కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్